Genelia: కామెడీ థ్రిల్లర్‌తో హీరోయిన్‌గా జెనీలియా రీఎంట్రీ..

Genelia (tv5news.in)

Genelia (tv5news.in)

Genelia: అప్పుడప్పుడు హిందీ, మరాఠీ సినిమాల్లో గెస్ట్ రోల్‌లో కనిపించిందే తప్పా హీరోయిన్‌గా చేయలేదు జెనీలియా.

Genelia: పదేళ్ల క్రితం జెనీలియా టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్ద క్రష్. తన సినిమాలు, అందులో తన క్యూట్ యాక్టింగ్‌తో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది జెనీలియా. అందుకే తాను సినిమాలకు దూరంగా ఉంటున్నా కూడా తన ఫాలోయింగ్ ఇంకా తగ్గలేదు. అందుకే తన అభిమానుల కోసం మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది జెనీలియా. తాజాగా బాలీవుడ్‌లో మరోసారి హీరోయిన్‌గా కనిపించనుంది.

2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడింది జెనీలియా. ఆ సంవత్సరంలోనే తన చివరి తెలుగు చిత్రం కూడా విడుదలయ్యింది. ఆ తర్వాత తాను మళ్లీ టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. అప్పుడప్పుడు హిందీ, మరాఠీ సినిమాల్లో గెస్ట్ రోల్‌లో కనిపించిందే తప్పా హీరోయిన్‌గా చేయలేదు. అయితే ఇన్నాళ్ల తర్వాత అభిమానులు మళ్లీ జెనీలియాను హీరోయిన్‌గా చూడబోతున్నారు.

షాద్‌‌ అలీ దర్శకత్వంలో జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మిస్టర్ మమ్మీ'. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేసింది మూవీ టీమ్. ఇందులో జెనీలియాతో పాటు రితేష్ కూడా ప్రెగ్నెంట్‌గా కనిపిస్తున్నాడు. అయితే పోస్టర్‌లాగానే సినిమా కూడా కామెడీగా ఉండబోతుందని మూవీ టీమ్ స్పష్టం చేసింది.



Tags

Read MoreRead Less
Next Story