27 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన జెంటిల్‌మెన్.. ఇప్పుడు ఇలా?

27 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన  జెంటిల్‌మెన్.. ఇప్పుడు ఇలా?

'జెంటిల్‌మెన్'.. 27 ఏళ్ల కింద వచ్చిన మూవీ అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద రికార్డు బ్రేక్ చేసింది. 1993లో తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. జెంటిల్‌మేన్ సినిమాకు ఏ.ఆర్.రహమాన్ అందించిన మ్యూజిక్ సంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీలో చికుబుకు చికుబుకు రైలే సాంగ్ యూత్‌ని ఉర్రూతలూగించింది. యాక్షన్‌ కింగ్ అర్జున్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీకి.. ఇప్పుడు సీక్వెల్‌ వస్తుంది. నిర్మాత కేటీ కుంజుమన్‌ 'జెంటిల్‌మేన్‌' మూవీకి సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తమిళం, తెలుగు, కన్నడ,మలయాళం, హిందీ వంటి ఐదు భాషల్లో తెరకెక్కించనున్నట్లు నిర్మాత ట్వీట్ చేశాడు.

రాజకీయనేతల అవినీతిని గుట్టురట్టు చేయడంతోపాటు, మన దేశంలోని విద్యావ్యవస్థ గురించి తెలియజేసేలా 'జెంటిల్‌మేన్‌' మూవీని తెరకెక్కించారు దర్శకుడు శంకర్. అర్జున్‌ సరసన మధుబాల, శుభశ్రీ నటించారు. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ మూవీ హిట్ అవ్వడంతో.. 1994లో 'ది జెంటిల్‌మేన్‌' పేరుతో హిందీలో తెరకెక్కించారు. చిరంజీవి హీరోగా రీమేక్ చేసిన ఈ మూవీ.. బాలీవుడ్‌లో నిరాశ పరిచింది. 27 సంవత్సరాల తర్వాత తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌లో బాలీవుడ్‌, టాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన పలువురు అగ్ర నటీనటులు నటించనున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ సీక్వెల్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనుందా.. లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి.



Tags

Next Story