సంపత్ నంది డైరెక్షన్ లో 'జార్జిరెడ్డి' మరో కొత్త సినిమా

టాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాలతో మెప్పించిన నటుడు సందీప్ మాధవ్.. మరో లేటెస్ట్ మూవీతో వచ్చాడు. గతేడాది 'గంధర్వ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ హైదరాబాదీ యాక్టర్.. తాజాగా కొత్త సినిమాపై అప్‌డేట్ అందించాడు. 'ఓదెల రైల్వే స్టేషన్' ఫేం అశోక్ తేజ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా లాంఛ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే సినిమా ప్రారంభోత్సవానికి పాపులర్ డైరెక్టర్ సంపత్ నంది క్లాప్ కొట్టాడు. కేసీఆర్ ఫిలింస్, శ్రీ మహా విష్ణు మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. కేథరిన్ థ్రెసా ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. సామాజిక ఇతివృత్తంతో సాగే సినిమాలు చేసే సందీప్ మరి ఈ సారి ఎలాంటి కథతో రాబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య' సినిమాలో రవితేజ భార్య పాత్రలో మెరిసిన కేథరిన్... ఈ చిత్రంలో ఎలాంటి రోల్ చేస్తుందనేది కూడా తెలియాల్సి ఉంది.
హీరో, హీరోయిన్లలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది క్లాప్ నివ్వగా, ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ స్వీచ్చాన్ చేశారు. ప్రసన్నకుమార్, జెమిని కిరణ్‌లు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. "ఓదెల రైల్వేస్టేషన్‌ను చూసి నిర్మాతలు తనకు ఈ అవకాశం ఇచ్చార"న్నారు. కథ వినగానే కేథరిన్, హీరో సందీప్‌లు ఎంతో ఆసక్తి చూపించారని, జార్జిరెడ్డి తరువాత ఎన్నో కథలు విన్న సందీప్ ఈ కథ వినగానే ఓకే చేశాడని చెప్పారు. "నా ఓదెల రైల్వేస్టేషన్‌కు పదిరెట్లు అద్భుతంగా ఈ సినిమా వుంటుంద"ని ఆయన స్పష్టం చేశారు.
ఇక "ఈ సినిమా కథ వినగానే తనకు ఎంతో నచ్చింద"ని హీరోయిన్ కేథరిన్ చెప్పారు. స్క్రీన్‌ప్లే బేస్‌డ్ సినిమా ఇది అని, సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. జార్జిరెడ్డి తరువాత చాలా కథలు విన్నానని. కానీ ఈ కథ వినగానే ఎంతో బాగా నచ్చిందని నటుడు సందీప్ కూడా వ్యాఖ్యానించారు. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందన్న ఆయన.. సినిమాలో వుండే ట్విస్ట్‌లు ఎవరూ ఊహించలేరని చెప్పారు. చాలా కాలంగా పోలీస్‌ఆఫీసర్ పాత్రలో నటించాలని మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానని, ఈ సినిమాలో అలాంటి పాత్ర దొరికిందన్నారు. హీరోయిన్ కేథరిన్ పాత్రను కూడా దర్శకుడు ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని రీతిలో డిజైన్ చేశారని, సినిమాకు మంచి టీమ్ కుదరింది ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇదిలా ఉండగా చిత్రంలో రాజా చెంబోలు, రవికాలే, దీక్షా పంత్, కీర్తిచావ్లా, నిష్మా, శ్రీనివాస్ రెడ్డి, మధునందన్, ఆనంద్ చక్రపాణి, సాయిరేవతి, భానుశ్రీ, దొరబాబు, బేబీ కృతి నందన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించారు. ఇక 'జోష్', 'రైల్వే స్టేషన్', 'దళం', 'జ్యోతిలక్ష్మి', 'లోఫర్' సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సిల్వర్ స్క్రీన్‌పై మెరిశాడు సందీప్ మాధవ్. లీడ్ యాక్టర్‌గా 'వంగవీటి', 'జార్జిరెడ్డి' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సందీప్ మాధవ్ ఈ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com