Ghani Movie: వరుణ్ తేజ్ సినిమా కోసం రామ్ చరణ్.. గని టీజర్‌లో..
Ghani Movie: వరుణ్ తేజ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాలను పెద్దగా చేయలేదు.

Ghani Movie (tv5news.in)
Ghani Movie: వరుణ్ తేజ్ తన కెరీర్‌లో ఇప్పటివరకు ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమాలను పెద్దగా చేయలేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, లవ్ స్టోరీస్ వైపే ఎక్కువగా ఆసక్తి చూపించాడు. యాక్షన్ సినిమాకు సరిపోయే కట్ అవుట్ ఉన్నా కూడా వరుణ్ తేజ్ ఆ జోనర్ వైపు ఎక్కువగా వెళ్లలేదు. కానీ మొదటిసారిగా ఒక బాక్సర్ పాత్రలో యాక్షన్ చేయడానికి వచ్చేస్తున్నాడు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రమే 'గని'. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, వరుణ్ తేజ్ వర్కవుట్ వీడియోలు చూస్తే ఈ సినిమా కోసం తాను ఎంత కష్టపడ్డాడో అర్ధమవుతోంది. ఇందులో వరుణ్‌కు జోడీగా సయ్యి మంజ్రేకర్ నటిస్తోంది. విలన్‌గా అలనాటి హీరో ఉపేంద్ర కనిపించనున్నాడు. ఇటీవల విడుదలయిన గని టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
టీజర్‌లో ఎవరూ ఊహించని ఓ సర్ప్రైజ్ ఉంది. అదే రామ్ చరణ్ వాయిస్ ఓవర్. తమ్ముడి కోసం తన గొంతుతో సినిమా టీజర్‌ను ఓపెన్ చేశాడు చరణ్. అయితే టీజర్ మొత్తంలో రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో చెప్పిన ఆ భారీ డైలాగులే హైలైట్‌గా నిలుస్తు్న్నాయి. విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. బాక్సర్ గనిగా వరుణ్ తేజ్ లుక్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
RELATED STORIES
Naga Chaitanya: గర్ల్‌ఫ్రెండ్‌తో కారులో చైతూ రొమాన్స్.. ఇంతలో...
14 Aug 2022 4:16 PM GMTAnasuya Bharadwaj: అవి నచ్చకే షో వదిలేశాను: అనసూయ భరద్వాజ్
14 Aug 2022 12:15 PM GMTVijay Devarakonda: విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ నటి కాదు..! ఆ మాటలకు...
14 Aug 2022 11:30 AM GMTVijayashanthi: 'టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా లాల్ సింగ్...
14 Aug 2022 10:50 AM GMTNTR: 'కొమురం భీం' పాత్రకు ఆస్కార్.. హాలీవుడ్లో కథనం..
14 Aug 2022 10:10 AM GMTDJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్.. నేహా శెట్టి ప్లేస్‌లో మలయాళ...
13 Aug 2022 4:23 PM GMT