Ghantasala Ratnakumar : ఘంటసాల రత్నకుమార్ గుండెపోటుతో కన్నుమూత

Ghantasala Ratnakumar : ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొనసాగిన ఆయన అనేక సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. రత్నకుమార్ తెలుగు, తమిళ భాషలలో 10,000 కి పైగా సీరియల్స్‌కు, 50 డాక్యుమెంటరీలకు గాత్రదానం చేశారు.
గురువారం చెన్నైలో ఆయన స్వర్గస్థులయ్యారు. కొన్ని రోజుల క్రితం కోవిడ్ వచ్చి కోలుకున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రత్నకుమార్ కొన్ని రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. రత్నకుమార్ సంగీత దర్శకుడి చిన్న కుమారుడు.
అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్ మరియు తమిళనాడు బుక్ ఫర్ రికార్డ్స్ తరువాత, రత్నకుమార్, 2012 లో ఎనిమిది గంటలు నాన్ స్టాప్ గా డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "నాకు మద్దతు ఇచ్చిన పరిశ్రమకు తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను" అని చెప్పారు.
మరొక ఇంటర్వ్యూలో మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానే ఎందుకు కొనసాగుతున్నారు. పాటలు పాడడాన్ని ఎందుకు ఎంచుకోలేదని అడిగారు. దానికి ఆయన సమాధానంగా
"నేను పాడాలని ప్రయత్నించాను, కానీ నాకు విరామం దొరకలేదు. తమిళ చిత్రం 'కంచి కామక్షి' తెలుగు వెర్షన్ కోసం డబ్ చేసినప్పుడు అది దాదాపు 100 రోజులు నడిచింది. దాంతో డబ్బింగ్ వైపు ఎక్కువ ఆఫర్లు వచ్చాయి. ఇక అప్పటి నుంచి డబ్బింగ్ నా వృత్తిగా మారింది." అని అన్నారు.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఇప్పటివరకు ఆయన వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. వీరుడొక్కడే, ఆట ఆరంభం, అంబేడ్కర్ చిత్రాలతో పాటు దాదాపు 30 సినిమాలకు ఆయన మాటలు రాశారు.
లెజెండ్ ఘంటసాల వెంకటేశ్వరరావు సావిత్రి, సరళాదేవి(దివంగత )ని వివాహం చేసుకున్నారు. ఆయనకు 8 మంది పిల్లలు 4 కుమార్తెలు (శ్యామల, సుగుణ, శాంతి, మీరా) , 4 కుమారులు (విజయ కుమార్, రత్నకుమార్, రవికుమార్, శంకర్ కుమార్).
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com