Gajala Shaikh Khan : గజాలా.. నో చేంజ్ !

నాలో ఉన్న ప్రేమ సినిమాతో తెరంగేట్రం చేసిన ముంబై ముద్దుగుమ్మ గజాలా షేక్ ఖాన్. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసర నటించి మెప్పించింది. 2001 నుంచి 2005 వరకు నాలుగేళ్లలోనే 12 తెలుగు సినిమాలు 3 తమిళ సినిమాల్లో నటించింది గజాలా. అమ్మడి అప్పటి స్పీడ్ చూస్తే తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ అవకాశం వచ్చిన ప్రతి సినిమా చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ కెరీర్ మీద పడింది. అలా అమ్మడి గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. 2005 లో శ్రావణమాసం సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత పెద్దగా ఛాన్సులు దక్కించుకోలేదు. ఆ తర్వాత పూర్తిగా తమిళంలో వరుస సినిమాలు చేస్తూ కన్నడలో ఒకటి మలయాళంలో రెండు సినిమాలు చేసింది గజాల. దాదాపు 19 ఏండ్ల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలోకి వచ్చింది గజాలా. ఇన్ స్టా వేదికగా ఫొటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకొనే ప నిలో పడింది. గజాలా ఇప్పటి ఫోటోలు చూస్తే అమ్మడిలో గ్లామర్ అలానే ఉందని అనిపిస్తుంది. కొద్దిగా ట్రై చేస్తే చాలు కానీ ఇప్పటికీ గజాలా సినిమాల్లో ప్రయత్నిస్తే తప్పకుండా మంచి ఆఫర్స్ వచ్చేలా ఉన్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. తెలుగు ఆడియన్స్ కు సుపరిచితురాలైన గజాలా ఇప్పటికీ అంతే అందంతో సర్ప్రైజ్ చేస్తోందంటున్నారు నెటిజన్లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com