Dimple Hayati : ఏనుగు టాటూతో గ్లామర్ బ్యూటీ

Dimple Hayati : ఏనుగు టాటూతో గ్లామర్ బ్యూటీ
X

గద్దలకొండ గణేష్ సినిమాలో జర్రా జర్రా అనే సాంగ్ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఖిలాడీ బ్యూటీ డింపుల్ హయతి. ఆతరువాత ఆమె రవితేజతో ఖిలాడీ సినిమా చేసింది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ తరువాత మ్యాచో స్టార్ గోపీచంద్ తో రామబాణం సినిమా చేసింది. కుటుంబకథా నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఈ అమ్మడుకు టాలీవుడ్ నుండి అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ప్రస్తుతం ఈ అమ్మడు వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఆమె ఫ్రెండ్స్ తో కలిసి థాయిలాండ్ వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఏనుగుల పార్క్ కి వెళ్లిన డింపుల్ తన కాలుపై ఏనుగు టాటూ వేయించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంది. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story