Sanjjanaa Galrani : హీరోయిన్ సంజన సీమంతం.. ఈసారి ముస్లిం సంప్రదాయంలో

Sanjjanaa Galrani : బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సంజనా గల్రానీ త్వరలో తల్లికాబోతున్న సంగతి తెలిసిందే.. గతనెలలో హిందూ సాంప్రదాయం ప్రకారంలో ఆమె సీమంతం జరుపుకుంది.. ఈ వేడుక అతికొద్దిమంది సమక్షంలో జరిగింది.. తాజాగా అందరి సమక్షంలో మరోసారి గ్రాండ్‌గా సీమంతం చేసుకుంది.. అయితే ఈ సారి ముస్లిం పద్ధతిలో ఆమె ఈ వేడుకను జరుపుకోవడం విశేషం.
ఈ ఫంక్షన్‌కు హాజరై తనను, పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమానికి 300 మంది హాజరు కాగా, ఈ కార్యక్రమంలో సంజన అత్తగారు చేసిన ముస్లీం తరహా మటన్ బిర్యానీ ఫంక్షన్ కి మెయిన్ హైలైట్ అని సంజన చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలావుండగా శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో మూడు నెలలు జైలు జీవితం గడిపిన సంజన.. బెయిల్‌పై బయటకు వచ్చి ప్రియుడు డాక్టర్ పాషాను 2021 జనవరిలో పెళ్లి చేసుకుంది. మరో 20 రోజుల్లో తన బిడ్డను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com