Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైర గౌరవం

Ram Charan :   గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైర గౌరవం
X

గ్లోబల్ రామ్ చరణ్ మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో మైనపు బొమ్మతో తన గ్లోబల్ స్టార్‌డమ్‌ను పర్మనెంట్ చేసుకోబోతున్నాడు. అబుదాబిలో జరిగిన స్టార్-స్టడెడ్ 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్‌లో ఈ ప్రకటన జరిగింది. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు మరియు ప్రపంచవ్యాప్త క్రేజ్ కు గుర్తింపుగా చరణ్ కి "మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు"ని అందించారు.

సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో ప్రతిష్టాత్మకమైన సూపర్‌స్టార్స్‌ లైనప్‌లో చేరడం నిజంగా గర్వకారణమని రామ్‌చరణ్‌ అన్నారు. "చిన్నప్పుడు, దిగ్గజ నటుల లైఫ్ ఎఛీవ్మెంట్ పర్సన్స్ ను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏదో ఒక రోజు నేను కూడా వారి మధ్య ఉంటానని కలల కూడా అనుకోలేదు. ఈ గుర్తింపు నా క్రాఫ్ట్ పట్ల నాకు ఉన్న కృషి, అభిరుచికి నిదర్శనం. ఈ అద్భుతమైన అవకాశం కోసం ఇచ్చినందుకు మేడమ్ టుస్సాడ్స్ నేను చాలా థ్యాంక్స్ చెబుతున్నాను..’

విశేషం ఏంటంటే.. రామ్ చరణ్ కటౌట్ కు స్పెషల్ టచ్ ను యాడ్ చేస్తూ.. ఆయనతో పాటు తన పెంపుడు కుక్క రైమ్ ను కూడా ఈ మ్యూజియంలో పెట్టబోతున్నారు. క్వీన్ ఎలిజబెత్ II తర్వాత వారితో పాటు ఒక పెంపుడు జంతువు అమరత్వం పొందిన ఏకైక సెలబ్రిటీగా రామ్ చరణ్ నిలవబోతున్నాడు. ఈ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్‌లో రైమ్ నాతో చేరడం నాకెంతో ప్రత్యేకం.. అది నా ప్రపంచం అని చెప్పేందుకు ఇది చాలు అని పంచుకున్నాడు చరణ్.

2017లో ప్రారంభమైన IIFA, మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ మధ్య భాగస్వామ్యం ప్రపంచ వేదికపై భారతీయ సినిమా వేడుకలను ఒకచోట చేర్చి, అభిమానులను తమ అభిమాన తారలతో ప్రత్యేకమైన రీతిలో నిమగ్నమయ్యేలా కొనసాగిస్తోంది.

"IIFAతో మా భాగస్వామ్యాన్ని కొనసాగించడం, మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో ప్రతిష్టాత్మకమైన భారతీయ సినిమా దిగ్గజాల శ్రేణికి రామ్ చరణ్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము" అని మెర్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోని గేట్‌వే ఆసియా రీజినల్ డైరెక్టర్ అలెక్స్ వార్డ్ అన్నారు. "ఈ భాగస్వామ్యం ప్రపంచంలో భారతీయ సినిమా ప్రభావాన్ని చూపించడానికి, మా అతిథులకు చిరస్మరణీయ అనుభవాలను అందించడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది అన్నారు".

రామ్ చరణ్ మైనపు బొమ్మను జోడించడం వలన మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్‌లో ఇప్పటికే ఉన్న "IIFA జోన్" మరింత బలోపేతం అవుతుంది, ఇందులో ఇప్పటికే షారూఖ్ ఖాన్, కాజోల్, కరణ్ జోహార్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజ భారతీయ సినీ తారల బొమ్మలు ఉన్నాయి. ఆ లిస్ట్ లోకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరబోతున్నాడు.

Tags

Next Story