RamCharan : రామ్ చరణ్ విగ్రహ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్

RamCharan :  రామ్ చరణ్ విగ్రహ ఆవిష్కరణకు డేట్ ఫిక్స్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ లో పెరిగింది. ఆర్ఆర్ఆర్ లో అతని నటనకు ఎన్నో దేశాల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అప్పటి నుంచి గ్లోబల్ స్టార్ ట్యాగ్ తో తన ఇమేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో చేసిన గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయినా.. అతని రేంజ్ తగ్గలేదు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ద చిత్రంతో రాబోతున్నాడు. 2026 మార్చి చివర్లో ఈ చిత్రం విడుదలవుతుంది. ఇక కొన్నాళ్ల క్రితమే రామ్ చరణ్ వాక్స్ స్టాచ్యూ ను మేడమ్ టుస్సాడ్ మ్యూజియమ్ లో ఆవిష్కరించుకునేందుకు కొలతలు తీసుకున్నారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించే డేట్ ను తాజాగా ఫిక్స్ చేశారు.

ప్రపంచ ప్రఖ్యాత నగరం అయిన లండన్ టుస్సాడ్ మ్యూజియంలో నెలకొల్పే ఈ విగ్రహాలు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకున్న వారికి మాత్రమే సొంతం అవుతాయి. మరి చరణ్ గ్లోబల్ స్టార్ కదా. అందుకే రామ్ చరణ్ వాక్స్ స్టాచ్యూను కూడా ఇక్కడ నెలకొల్పబోతున్నారు. ఆల్రెడీ కొలతలు తీసుకున్నారు. ఇక ఈ విగ్రహాన్ని మే 9న సాయంత్రం ఆవిష్కరించబోతున్నారు. ఈ మేరకు టుస్సాడ్ మ్యూజియం నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. మరి ఈ సందర్భాన్ని మెగా ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూడాలి.

Tags

Next Story