GOAT Trailer : గోట్.. విజువల్ ట్రీట్
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తీస్తున్న మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ లో భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను సైతం లాంచ్ చేయగా హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. 24 గంటల్లోనే 22 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ట్రైలర్ లో విజయ్ డ్యుయల్ రోల్ లో కనిపించాడు. అయితే, ఆయన డీ–ఏజింగ్ లుక్ పై వస్తున్న విమర్శలపై డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించారు. ‘ఇటీవల విడుదలైన స్పార్క్ సాంగ్‌లోని విజయ్ డీ- ఏజింగ్ లుక్ విషయంలో ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం. విజయ్ సర్ ఆయన ఓపినీయన్ చెప్పి సజెషన్స్ ఇచ్చారు. అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని చేంజేస్ చేశాం. ట్రైలర్‌లో చూపించిన లుక్ ఫైనల్. సినిమాలోనూ అదే కనిపిస్తుంది. గోట్ థియేటర్లలో మంచి విజువల్ ట్రీట్ ఇస్తుంది’అని వెంకట్ ప్రభు తెలిపారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభుదేవా, లైలా, ప్రశాంత్, స్నేహ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 5న గోట్ రిలీజ్ కానుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com