G.O.A.T (Greatest of All Time) : మాస్ రగ్డ్ లుక్‌లో సుడిగాలి సుధీర్

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరోగా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే మూడు చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన.. ప్రస్తుతం మరో కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. 'గోట్ ; ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ '(G.O.A.T. - Greatest of All Time) అనే టైటిల్ తో రాబోతున్న సుడిగాలి సుధీర్ కొత్త సినిమాలో దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వర్ధిస్తున్నారు.
మహాతేజ క్రియేషన్స్ పతాకంపై 'గోట్ ; ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ' ని చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సుధీర్ ఒక చేత్తో క్రికెట్ బ్యాక్ పట్టుకుని, మరో చేత్తో సిగరెట్ కాల్చుతూ మాస్ రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. లియోన్ జేమ్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా ఉంది. మాస్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యింది.
రెండు పాటలు చిత్రీకరణ కూడా పూర్తి అయిందని దర్శక, నిర్మాతలు చెబుతునన్నారు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని అన్నారు. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో ఉంటుందని తెలుపారు. దాంతో పాటు సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుందనిని నిర్మాతలు చెప్పారు. కాగా ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, డీఓపీ: బాలాజీ సుబ్రహ్మణ్యం, ఎడిటర్: కె.విజయవర్ధన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, రచయిత: ఫణికృష్ణ సిరికి
https://t.co/z6gDx5ccAT#GOATTheMovie pic.twitter.com/o3dD1OKGlD
— Sudigali Sudheer (@sudheeranand) August 21, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com