Vijay's Goat Trailer : గోట్ ట్రైలర్ .. సింహం ఎప్పుడూ సింహమే

Vijays Goat Trailer  :   గోట్ ట్రైలర్ .. సింహం ఎప్పుడూ సింహమే
X

తమిళ్ స్టార్ దళపతి విజయ్ కొత్త సినిమా గోట్. అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అర్థం. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. విజయ్ ఫ్యాన్స్ నుంచి మోస్ట్ అవెయిటెడ్ మూవీ అనిపించుకుంటోన్న గోట్ ట్రైలర్ చూస్తే కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ గా కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో అతను చేసిన కొన్ని మూవీస్ లో డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. ఈ సారి కూడా తండ్రి కొడుకులుగా నటించాడని అర్థం అవుతోంది.

‘గయ్స్ దిస్ ఈజ్ ఏ న్యూ ఎసైన్ మెంట్.. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. 68 సక్సెస్ ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్.. హాస్టేజ్ నెగోషియేటర్, ఫీల్డ్ ఏజెంట్, స్పై.. సింపుల్ గా చెబితే అతను మన శాట్ లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్.. ’ అంటూ మరో నటుడు ప్రశాంత్ ఎక్స్ ప్లెయిన్ చేస్తుండగా ఆ అన్ని ఫామ్స్ లోనూ విజయ్ కనిపించే వీడియోస్ తో స్టార్ట్ అయింది ట్రైలర్. ఆ ఎలివేషన్స్ కు తగ్గట్టుగా మోస్ట్ స్టైలిష్ యాక్షన్స్ తో నిండి ఉంది ట్రైలర్. ఆపై పురిటి నొప్పులతో ఉన్న స్నేహ.. ఆమె పక్కనే డాక్టర్ గా లైలా.. స్నేహ తన భర్త గురించి అనేక డౌట్స్ ను వెలిబుచ్చడం.. దానికి సంబంధించిన ఫన్నీ సీన్స్ తో ట్రైలర్ లో మరో యాంగిల్ కనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ లో హైలెట్ గా కనిపించిందేంటంటే.. 80, 90లలో లవబుల్ హీరోగా పేరు తెచ్చుకున్న తమిళ్ స్టార్ మైక్ మోహన్ విలన్ గా కనిపిస్తున్నాడు. అలాగే ప్రభుదేవా, ప్రశాంత్ తో పాటు జయరాం పాత్రలూ కీలకంగా ఉన్నాయి. దేశాన్ని కాపాడే ఓ స్పై డిపార్ట్ మెంట్ నుంచి తప్పుకున్న తర్వాత మరో పెద్ద బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసం తన కొడుకు సాయం కూడా తీసుకుంటాడు. మరి ఆ పెద్ద బాధ్యత ఏంటీ.. ఈ పోరాటంలో అతను తన కుటుంబాన్ని మిస్ అయ్యాడా.. మిస్ చేసుకున్నాడా అనే అంశాలు సినిమాలో ఉంటాయి. ట్రైలర్ చివరలో ‘వయసైంది.. స్క్వాడ్ వదిలిపెట్టి ఎన్నో యేళ్లైంది.. ఎలాగా అని ఆలోచిస్తున్నారా..’.. అని తన సీనియర్ ఆఫీసర్ ను అడుగుతాడు.. దానికి అతడు.. ‘ ఎంత వయసైతే ఏంటయ్యా.. ఏ లయన్ ఈజ్ ఆల్వేస్ ఏ లయన్.. ’ అని బదులిచ్చే డైలాగ్ విజయ్ క్యారెక్టరైజేషన్ పవర్ ను తెలియజేస్తుంది.

ఓవరాల్ గా చూస్తే విజయ్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే ట్రైలర్ ఇది. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఓ మాస్ యాక్షన్ మూవీలో ఉండాల్సిన అన్ని అంశాలతో పాటు ఎంటర్టైన్మెంట్ కు కూడా ఢోకా ఉండదు అన్న భరోసా ఇస్తోందీ ట్రైలర్. కాకపోతే అక్కడక్కడా విజయ్ చిన్నప్పటి లుక్ కోసం చేసిన విజువల్ ఎఫెక్ట్స్ ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇంకాస్త క్వాలిటీతో చేసి ఉండాల్సింది. ఆచార్యలో చిన్నప్పటి చిరంజీవిలా కమెడియన్ లా కనిపించాడు ఆ షాట్ లో. దీంతో పాటు యువన్ శంకర్ రాజా నేపథ్యం సంగీతం మైనస్ కావొచ్చేమో అనే ఫీలింగ్ కూడా కలిగింది. బట్ థియేటర్స్ లో మంచి సౌండ్స్ తో చూస్తే ఒపీనియన్ మారొచ్చేమో. ఫీమేల్ లీడ్ లో మీనాక్షి చౌదరి జస్ట్ సైడ్ కిక్ లాగే ఉందీ ట్రైలర్ లో.

ఓవరాల్ గా విజయ్ చేస్తోన్న చివరి సినిమాకు ముందు సినిమా ఇది. గోట్ తర్వాత మరో మూవీ మాత్రమే చేసి రిటైర్ అవుతా అని ప్రకటించాడు కాబట్టి.. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా.. కోలీవుడ్ రికార్డులు బద్ధలైపోతాయి.

Tags

Next Story