Shraddha Srinath : గాడ్ ఆఫ్ మాసెస్ నో అన్నాడు.. మాస్ కా దాస్ ఎస్ అన్నాడు

Shraddha Srinath : గాడ్ ఆఫ్ మాసెస్ నో అన్నాడు.. మాస్ కా దాస్ ఎస్ అన్నాడు
X

ఏ హీరోయిన్ కైనా ఓ పెద్ద హీరో సినిమాలో ఆఫర్ వస్తే ఎంత హ్యాపీగా ఫీలవుతుందో.. ఒకవేళ ఆ ఆఫర్ చేజారితే అంతే ఫీలవుతుంది. రీసెంట్ గా గాడ్ ఆఫ్ మాసెస్ అని ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటోన్న బాలయ్య కొత్త సినిమా నుంచి హీరోయిన్ శ్రద్ధా దాస్ ను తీసేశారు. ఆమె స్థానంలో అఖండ బ్యూటీ ప్రగ్యా జై స్వాల్ ను తీసుకున్నారు. అయితే శ్రద్ధాను ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తొలగించారు అనేందుకు సరైన రీజన్స్ ఇప్పటి వరకూ తెలియదు. అయితే అమ్మడికి ఆ ఆఫర్ పోయినా ఇప్పుడు మరో ఆఫర్ వచ్చింది. అదీ బాలయ్య అంటే ఇష్టం అని చెప్పే విశ్వక్ సేన్ సినిమాలో.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త సినిమా మెకానిక్ రాకీ. ఈ మూవీలోనే శ్రద్ధా శ్రీనాథ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఈ మూవీలో ఆల్రెడీ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. మరి తన స్థానంలో శ్రద్ధా వచ్చిందా లేక తను సెకండ్ హీరోయిన్ గా నటించబోతోందా అనేది తెలియాలి. ఇక మెకానిక్ రాకీ చిత్రాన్ని అక్టబర్ 31న విడుదల చేయబోతున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మరి ఇంత తక్కువ టైమ్ లో మరో హీరోయిన్ అంటే ఖచ్చితంగా శ్రద్ధాది సెకండ్ హీరోయిన పాత్రే అనుకోవచ్చు. మొత్తంగా బాలయ్య వదిలిసినా విశ్వక్ సినిమాలో ఆఫర్ అందుకుందీ జెర్సీ బ్యూటీ.

Tags

Next Story