గోరింటాకు పెట్టుకున్న సందమామ

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతోందీ మూవీ. వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించినట్టుగా ముందు నుంచీ చెబుతున్నారు. అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేస్తున్నాం అని ప్రకటించిన తర్వాత.. ఆ పాటను ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్.. డిఫరెంట్ వాయిస్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రమణ గోగులతో పాడిస్తున్నాం అని చెప్పి.. మరింత ఊరించారు. ఫైనల్ గా ఈ పాటను విడుదల చేశారు.
‘గోదారి గట్టు మీద రామసిలకవే.. గోరింటాకెట్టుకున్నా సందామామవే’.. అంటూ భాస్కర భట్ల రాసిన ఈ గీతాన్ని రమణ గోగులతో పాటు మధుప్రియ పాడారు. ఆ పాట సందర్భాన్ని తన సాహిత్యంలో స్పష్టంగా అర్థమయ్యేలా రాశాడు భాస్కర భట్ల. ఇంటి నిండా చుట్టాలు వచ్చిన సందర్భంలో విరహాన్ని తట్టుకోలేని ఓ భర్త తన భార్యను తీసుకుని డాబా ఎక్కి ముద్దు ముచ్చట కోసం బతిమాలుకోవడం.. ఇలాంటి సందర్భాల్లో సరసమేంటనీ ఆ భార్య వారించడం అనే సందర్భంగా కనిపిస్తోందీ సాంగ్. వెంకీ స్టెప్పులు స్పెషల్ గా కనిపిస్తున్నాయి.
రమణ గోగుల చాలా యేళ్ల తర్వాత పాడటం వల్ల పాట కాస్త ఫ్రెష్ గా అనిపిస్తోంది. బట్ వెంకీ గాత్రానికి అంత సూట్ అయినట్టు కనిపించడం లేదు. ఆయన కాకుండా ఆడియోగా వింటే మాత్రం అదిరిపోయేలా ఉంది. గాత్రంలో మధుప్రియ ఎక్స్ ప్రెషన్స్ బావున్నాయి. మొత్తంగా ఈ పాటతో వీళ్లు కూడా ఇక ప్రమోషన్స్ ను షురూ చేశారనే అనుకోవాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com