Golden Globe Awards: నాతో పాటు నా బిడ్డ కూడా ఈ ఆనంద క్షణాలను.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్

Golden Globe Awards: లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో RRR టీమ్ అవార్డు గెలుచుకున్న ఆనంద క్షణాలను ఆస్వాదిస్తోంది. RRR చిత్రం 2 విభాగాల్లో నామినేట్ చేయబడింది - ఉత్తమ ఆంగ్లేతర భాషా చిత్రం మరియు ఉత్తమ పాట. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన RRR నాటు నాటు పాట ఉత్తమ పాటల విభాగంలో గెలుపొందింది.
ఇంతటి సంతోషకరమైన విషయాన్ని రామ్ చరణ్ భార్య ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈవెంట్‌కు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు. భర్త రామ్ చరణ్‌తో తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఉపాసన భావోద్వేగంతో తన అనుభవాన్ని మాటల ద్వారా వెల్లడించింది. "నాతో పాటు నా బిడ్డ కూడా దీనిని అనుభవించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా ఎమోషనల్‌గా ఉన్నాను."
ఉపాసన పోస్ట్: " RRR కుటుంబంలో భాగమైనందుకు ఇంతటి గౌరవం దక్కింది. భారతీయ సినిమాకు అవార్డు రావడం మనందరికీ గర్వకారణం. "మిస్టర్ సి కి, రాజమౌళి గార్కి ధన్యవాదాలు. నన్ను ఈ ప్రయాణంలో భాగం చేసినందుకు కృతజ్ఞతలు. ఉక్రెయిన్‌లో షూటింగ్ నుండి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వరకు మీరు నాకు ఎన్నో నేర్పించారు, ఆలోచనలో స్పష్టత, కృషి, పట్టుదల ఉంటే ప్రతిఫలం అందుతుంది.
రామ్ చరణ్, ఉపాసన తమ మొదటి బిడ్డకు త్వరలో జన్మనివ్వబోతున్నారు. ఈ సంతోషకరమైన శుభవార్తను గత నెలలో చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com