Golden Heart : ఇన్ స్టాలో ఫాలోవర్స్ కోసం యువతికి బన్నీ హెల్ప్

భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ కూడా ఉన్నాడు. ఈయన ఇటీవల తన పుష్ప చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నాడు. అతను సాధారణంగా తన అభిమానులతో సన్నిహితంగా ఉండటానికి, తన కార్యకలాపాల గురించి వారికి తెలియజేయడానికి ప్రసిద్ది చెందాడు. అయితే నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని పోలింగ్ బూత్‌లో అల్లు అర్జున్ ఓటు వేసేందుకు వెళ్లారు. అతను పోలింగ్ బూత్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఓ కొత్త వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ వీడియోలో, అల్లు అర్జున్ కు తన టార్గెట్ ఫాలోవర్స్ గురించి ఒక మహిళ చెప్పడం చూడవచ్చు.
ఈ వీడియోను అల్లు అర్జున్ క్యాప్చర్ చేశారు. తనకు 13 వేల మంది ఫాలోవర్లు ఉన్నారని, 30 వేలకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు ఆ మహిళ అతనికి చెప్పడం ఈ వీడియోల కనిపిస్తుంది. ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకోవడంలో తన వీడియో ఆమెకు సహాయపడుతుందని అల్లు అర్జున్ మహిళకు హామీ ఇవ్వడం ఇందులో కనిపిస్తుంది. ఈ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులకు ఈ రోజును ఓ స్పెషల్ డేగా మార్చింది.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తదుపరి సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న 'పుష్ప: ది రూల్'లో కనిపించనున్నారు. ఇక ఇటీవలి కాలంలో ఈ సినిమాకు సంబంధించి పలువార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో తన పాత్రకు ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని సమాచారం. కానీ ఈ మూవీ రిలీజ్ తర్వాత వచ్చిన లాభాల్లో 33శాతం షేర్ ను బన్నీ కావాలని కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వార్త క్షణాల్లోనే సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
Bunny Boi 😂❤️ - @alluarjun pic.twitter.com/RvNlvolkdh
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) November 30, 2023
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com