Trisha : గుడ్లక్ విజయ్.. నీకు అంతా మంచే జరగాలి.. త్రిష పోస్ట్

Trisha : గుడ్లక్ విజయ్.. నీకు అంతా మంచే జరగాలి.. త్రిష పోస్ట్
X

హీరోయిన్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యూటీ త్రిష, తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయకి గా మారింది. సినీ ఇండస్ట్రీలో చాలా ఎత్తుపల్లాలతో పడిలేస్తూ తన కెరీర్ను పదిలపరుచు కుంటూ వస్తున్న ఈ అందాలభామ .. ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు సూర్యతో కలిసి నటిస్తున్న 'కరుప్పు' చిత్రం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కాగా.. దీపావళి సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీనికి తోడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటిస్తున్న 'విశ్వంభర' వచ్చే ఏడాది సమ్మర్లో బరిలోకి దిగడా నికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతుందని... కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో రిలేషన్ లో ఉందని పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కలిసి వెకేషన్స్, టూర్స్ అంటూ ఎక్కడో ఒకచోట కెమెరా కంటికి కనిపిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా త్రిష.. విజయ్ పై సైమా అవార్డ్స్ వేడుకలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నా యి. ఆమె స్టేజ్ మీద ఉన్నప్పుడు విజయ్ ఫొటో చూపించారు. ఆ సమయంలో త్రిష ఎంతో సిగ్గు పడుతూ కనిపించింది. 'గుడ్లక్ విజయ్.. నీ న్యూ జర్నీలో అంతా మంచే జరగాలి. నువ్వు కన్న కలలన్నీ నిజం కావాలి. ఎందుకంటే దానికి 'నువ్వు అర్హుడివి' అని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నారనే వార్తలు మరోసారి ఊపందుకున్నాయి..

Next Story