Ram Charan : రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇన్నాళ్లు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ అప్డేట్ రాబోతోంది. యస్.. ఇది గేమ్ ఛేంజర్ కు సంబంధించిన వార్తే. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించిన ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇప్పటి వరకూ వచ్చిన రెండు పాటలూ ఫ్యాన్స్ కు మాత్రమే కిక్ ఇచ్చాయి కానీ.. ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించాయి అని చెప్పలేం. కాకపోతే ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ కోసం కంట్రీ మొత్తం చూస్తోంది.
గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు. ఒకటి ఐఏఎస్ గా మరొకటి పొలిటీషియన్ గా అన్నారు. రెండు వైవిధ్యమైన పాత్రలంటే ఖచ్చితంగా నెక్ట్స్ లెవల్ కంటెంట్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. నాయక్ తర్వాత రామ్ చరణ్ చేస్తోన్న డ్యూయొల్ రోల్ మూవీ ఇది. అందుకే చాలామంది ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే కంటెంట్ ఎలా ఉంటుందా అనే క్యూరియాసిటీని క్లియర్ చేయడంలో మూవీ టీమ్ ఫెయిల్ అయింది. అంటే ఇప్పటికే ఓ టీజరో లేక కనీసం ఓ గ్లింప్స్ అయినా రిలీజ్ చేసి ఉంటే బావుండేది అనే భావన చాలామందిలో ఉంది.
సో.. ఫ్యాన్స్ ఎక్కువగా ఈ దీపావళికి టీజర్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వారి ఎక్స్ పెక్టేషన్స్ మేకర్స్ కు తెలుసు. అందుకే దీపావళికి టీజర్ విడుదల చేసే ప్లాన్ లో ఉందట టీమ్. ఇప్పటి వరకూ అందుకు సంబంధించిన ఫీలర్స్ వదల్లేదు కానీ.. టీజర్ గ్యారెంటీ అని టాక్. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఇదేదో ఒక వారం ముందుగానే అనౌన్స్ చేస్తే మా పనిలో మేం ఉంటాం కదా.. సోషల్ మీడియా షేక్ అయ్యేలా చూసుకుంటాం కదా.. అని ఫీలవుతున్నారు. ఈ ఫ్యాన్స్ ఆశలకు అంతే ఉండదు అనిపిస్తుంది కదా.. అంతే మరి.. వారు అంతులేని ఆశలతో ఉంటేనే కదా.. సినిమాలు అంచనాలను మించి పోయేది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com