sirivennela seetharama sastry: 'ఓకే గూగుల్ ప్లే సిరివెన్నెల సాంగ్స్'.. సీతారామశాస్త్రికి గూగుల్ నివాళి..
sirivennela seetharama sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.. వాహ్ అనాల్సిందే. ఆయన రచన, సాహిత్యం అలాంటిది. అంతే కాదు అక్షరానికి ఎంత శక్తి ఉంటుందని తెలియజేసేవారు చాలాతక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోగలిగే వ్యక్తి సీతారామశాస్త్రి. అందుకే సెర్చ్ ఇంజెన్ గూగుల్ సైతం ఆయనకు నివాళులు అర్పించింది.
సీతారామశాస్త్రి ఇంక మనతో లేరు. కానీ ఆయన రాసిన ఎన్నో వేల పాటలను మనతో వదిలేసి వెళ్లారు. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాహిత్యాన్ని వదిలేసి వెళ్లారు. ఆయన రాసిన ప్రతీ అక్షరంలో.. సీతారామశాస్త్రి మనకు ఎప్పుడూ గుర్తుండిపోతారు. మామూలుగా ఆయన గురించి ఏం తెలుసుకోవాలన్నా, ఏ పాట వినాలన్నా గూగుల్‌నే అడుగుతాం.. అది తెలియజేస్తూనే గూగుల్ సీతారామశాస్త్రికి నివాళిగా ఓ ట్వీట్ చేసింది.
ఓకే గూగుల్ ప్లే సిరివెన్నెల సాంగ్స్ అని చెప్పగానే గూగుల్ మన మాట వింటుంది. ఆయన మరణాన్ని మరచిపోవడానికి గూగుల్ కూడా ఇదే చెప్తోంది. 'సిరివెన్నెలతో మొదలయిన జీవన గీతం, సీతారామశాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం' అంటే గూగుల్ చేసిన ఎమోషనల్ ట్వీట్.. ఆయన సినీ ప్రస్థానాన్ని మరోసారి అభిమానులకు గుర్తుచేస్తున్నట్టుగా ఉంది.
Ok Google, play Sirivennela songs 😞💔
— Google India (@GoogleIndia) November 30, 2021
"సిరివెన్నెల" తో మొదలయిన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం 🙌
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com