Gopichand Malineni : గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ 'జాట్'
గోపీచంద్ మలినేని బాలీవుడ్ కు వెళుతున్నాడుఅన్నప్పుడు చాలామంది అనుమానించారు. బట్ మైత్రీ మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ లో సినిమా అనగానే ఫిక్స్ అయ్యారు. మనోడు అక్కడి ఆడియన్స్ కు కూడా క్రాక్ తెప్పించే మాస్ మూవీ చేయబోతున్నాడని. అది నిజమే అనిపించేలా ఉంది గోపీచంద్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ పోస్టర్. ఒకప్పుడు మాస్ మూవీస్ తో బాలీవుడ్ ను షేక్ చేసిన సన్నీ డియోల్.. గదర్ 2తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఈవయసులో కూడా అద్భుతమైన స్టంట్స్ తో అదరగొడుతున్నాడు. ఓ రకంగా యాక్షన్ లో బాలీవుడ్ బాలయ్య లాంటి వాడు సన్నీ డియోల్. అలాంటి సన్నీతో సినిమా చేసే ఛాన్స్ అంటే గోపీచంద్ బాలీవుడ్ కి బంపర్ ఎంట్రీ ఇస్తున్నాడనే చెప్పాలి.
ఇన్నాళ్లూ 'ఎస్.డి,జి.ఎమ్' అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. సన్నీ డియోల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ 'జాట్'. సన్నీ తన ఇమేజ్ కు తగ్గట్టుగా ఓ యాక్షన్ సీక్వెన్స్ లో భారీ ఫ్యాన్ ను ఆయుధంగా పట్టుకుని అగ్రెసివ్ గా చూస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. గోపీచంద్ మాస్ ను మెప్పించడంలో స్పెషల్ గా కనిపిస్తాడు. ఆ స్పెషాలిటీ బాలీవుడ్ కు కూడా చూపించబోతున్నాడని ఈ లుక్ చూస్తేనే అర్థం అవుతోంది.
ఇక సన్నీ డియోల్ తో పాటు రణదీప్ హుడా, రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్, వీనీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు చేస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ జాట్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com