Gopichand : మరో సినిమా ప్రారంభించిన గోపీచంద్

మేచో స్టార్ గోపీచంద్.. తన రేంజ్ కు తగ్గ విజయాలు సాధించలేపోతున్నాడు. అతని నుంచి బ్లాక్ బస్టర్ అనే మాట విని ఏళ్లు గడిచిపోయింది. గజినీలా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు కానీ.. నిజం గజినీలా సొమ్ములు కొల్లగొట్టలేకపోతున్నాడు. అయితే చాలా రోజుల తర్వాత ప్రతి ఒక్కరూ హర్షించే ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. ఘాజీ, అంతరిక్షం ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో ఓ పీరియాడిక్ మూవీకి ఓకే చెప్పాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తోన్న ఈ మూవీ 7వ శతాబ్ద కాలంలో సాగుతుందని టాక్. ఓ అడ్వెంచరస్ మూవీలా ఉంటుందట. ఆల్రెడీ ఆ పాయింట్ తో అతను చేసిన సాహసం హిట్. కానీ సంకల్ప్ కంటెంట్స్ వేరుగా ఉంటాయి కదా.. అందుకే అంతా గోపీచంద్ ఫైనల్ గా కరెక్ట్ లైన్ లోకి వచ్చాడు అంటున్నారు. ఇది షూటింగ్ లో ఉండగానే లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ ఓపెనింగ్ చేశాడు గోపీచంద్.
బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతోన్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో లాంఛనంగా మొదలయ్యాయి. ఈ చిత్రంతో కుమార్ వెల్లంకి అనే అతను దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. కొన్నాళ్ల క్రితం ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చింది అని చెప్పాడు గోపీచంద్. అది ఇదే అంటున్నారు. షామ్ దత్ సినిమాటోగ్రఫీ అందించబోతోన్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇతర కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. మొత్తంగా రెండు ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ అతని చేతిలో ఉన్నాయి. వీటిలో హిట్స్ కొడితే మళ్లీ గోపీచంద్ రేంజ్ మారుతుందని చెప్పొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com