Gopichand: గోపీచంద్‌కు రామబాణం కలిసొస్తుందా!!

Gopichand: గోపీచంద్‌కు రామబాణం కలిసొస్తుందా!!
Gopichand: ఒకప్పుడు యాంగ్రీయంగ్ మేన్ గా సాలిడ్ హిట్స్ అందుకున్నాడు గోపీచంద్. ఒక్క లౌక్యం అతని కెరీర్ లో సౌఖ్యం లేకుండా చేసింది.

Gopichand: ఒకప్పుడు యాంగ్రీయంగ్ మేన్ గా సాలిడ్ హిట్స్ అందుకున్నాడు గోపీచంద్. ఒక్క లౌక్యం అతని కెరీర్ లో సౌఖ్యం లేకుండా చేసింది. యస్.. ఇమేజ్ ను మార్చుకోవాలనే తాపత్రయంలో అప్పుడున్న ట్రెండ్ కు అనుగుణంగా చేసిన లౌక్యం హిట్ అయింది. దీంతో తర్వాతి సినిమాలన్నీ ఆ ప్యాట్రన్ లో చేశాడు. ఒకే తరహా సినిమాలను కంటిన్యూస్ గా ఎందుకు చూస్తారు.



పైగా గోపీచంద్ అంటే ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ వేరే కదా..? ఆవిషయం తెలుసుకునే సరికి లేట్ అయింది. వరుసగా ఫ్లాపులు చుట్టుముట్టాయి. ఆ మధ్య సీటీమార్ బావుంది అనిపించుకుంది. బట్ చివరగా వచ్చిన పక్కా కమర్షియల్ బిగ్గెస్ట్ డిజాస్టర్. అయినా ఇప్పుడు రామబాణంతో వస్తున్నాడు గోపీచంద్.


గోపీచంద్ సినిమా అంటే ప్రేక్షకుల్లో కనిపించే అంచనాలు వేరే. ముఖ్యంగా మాస్ ను అతను ఎంటర్టైన్ చేస్తాడు. వారిని దాటి కథలు ఎంచుకునే తప్పులు చేశాడు. ఆ తప్పులు అతని కెరీర్ నే ప్రమాదంలో పడేశాయని చెప్పొచ్చు. తప్పు తెలుసుకుని గౌతమ్ నందా నుంచి పంథా మార్చాడు. అయినా అతని చాణక్య వ్యూహాలు ఫలించలేదు. ఓ బ్లాక్ బస్టర్ కొట్టాలన్న పంతం నెరవేరలేదు. కబడ్డీ నేపథ్యంలో వచ్చిన సీటీమార్ కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది.



బట్ పక్కా కమర్షియల్ తో పెద్ద డిజాస్టర్ చూశాడు. ఓ దశలో గోపీచంద్ ఇక విలన్ చేయాల్సిందే అనే కమెంట్స్ కూడా వచ్చాయి. కానీ అతనికి నిర్మాతలున్నారు కదా.. విలన్ గా ఎందుకు చేస్తాడు. అందుకే ఇప్పుడు మరో కథతో వస్తున్నాడు. ఈ మూవీ పేరు రామబాణం. రీసెంట్ గా వచ్చిన ఖిలాడీ సినిమాలో బికినీతో ఆకట్టుకున్న డస్కీ బ్యూటీ డింపుల్ హయాతీ హీరోయిన్ గా నటిస్తోంది.



గతంలో గోపీచంద్ తో లక్ష్యం, లౌక్యం వంటి బ్లాక్‌ బస్టర్స్ తీసిన శ్రీవాస్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా.. ఓ సోషల్ ఇష్యూను టచ్ చేస్తూ ఈ కథ సాగుతుందట. శ్రీవాస్ 2018లో చేసిన సాక్ష్యం బానే ఆకట్టుకుంది. అయినా బాగా గ్యాప్ వచ్చింది. మొత్తంగా ఇప్పుడీ ఇద్దరికీ ఓ సూపర్ హిట్ కావాలి. ఆ సూపర్ హిట్ కలను ఈ రామబాణం ఛేదిస్తుందా లేదా అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story