Gopichand : ఇంట్రెస్టింగ్ : మహేష్‌కు విలన్‌గా గోపీచంద్..!

Gopichand : ప్రస్తుతం మహేష్ బాబు సర్కారి వారి పాట సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుంది. ఆ తర్వాత రాజమౌళితో సినిమా చేయనున్నాడు మహేష్.. మహేష్, రాజమౌళి సినిమా ఉంటుందని ఎప్పుడో అనౌన్సు అయింది. దీనికి సంబంధించిన కథాచర్చలు ప్రస్తుతం నడుస్తున్నాయి.
అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో విలన్‌గా స్టార్ హీరో గోపీచంద్ నటించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే గోపీచంద్‌ని రాజమౌళి సంప్రదించారని, విలన్‌గా చేసేందుకు గోపీచంద్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఫిలింనగర్ టాక్.
కాగా తేజ దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా వచ్చిన నిజం సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటించాడు. ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే మూవీని చేస్తున్నాడు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com