Gopichand : గోపీచంద్.. ఈ సారైనా కొడతాడా

Gopichand : గోపీచంద్.. ఈ సారైనా కొడతాడా
X

మేచో స్టార్ గా ఇమేజ్ ఉన్నా.. ఆ ఇమేజ్ కు దగ్గ సక్సెస్ లు లేని హీరో గోపీచంద్. కొన్నాళ్లుగా హిట్ అనే మాటే రావడం లేదు అతని సినిమాలకు. మామూలుగా ఓ రెండు మూడు ఫ్లాపులు పడితేనే కొత్త కథలు ప్రయత్నించాలని చూస్తున్నారు. అలాంటిది రవితేజ మాత్రం ఇంకా తన ఇమేజ్ కు తగ్గ కథలనే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఏ ఇమేజ్ అయినా అప్పుడప్పుడూ రిపేర్ కు వస్తుంది. ఇందుకు మెగాస్టార్ నుంచి మినీ స్టార్ వరకూ ఎవరూ మినహాయింపు కాదు. అప్పుడే కొత్త ప్రయత్నాలు చేయాలి. కొత్త కథలు సెలెక్ట్ చేసుకోవాలి. అవసరమైతే హీరోయిజం కాస్త తగ్గినా ఫర్వాలేదు అనుకోవాలి. బట్ గోపీచంద్ ఈ విషయంలో ఎప్పుడూ తగ్గలేదు. చివరగా వచ్చిన భీమాలో అదుర్స్ లోని ఎన్టీఆర్ ను తలపించాలని చూసి భంగపడటం లాంటివి కూడా ఉన్నాయి. కానీ ఇది అతనే ఫస్ట్ టైమ్ చేస్తే ప్రయోగం అవుతుంది. ఎవర్నో ఇమిటేట్ చేయాలనుకుంటే మిస్ ఫైర్ అవుతుంది. ఆ మూవీ విషయంలో అదే జరిగింది.

ఇక ఇప్పుడు తనలాగే వరుస ఫ్లాపులతో ఫేడవుట్ అయిన శ్రీను వైట్ల డైరెక్షన్ లో ‘విశ్వం’ అనే మూవీ చేస్తున్నాడు. తనకు రెండు అక్షరాలు.. చివర్లో సున్నా ఉన్న టైటిల్స్ హిట్స్ తెస్తాయి అనే నమ్మకం ఉంది గోపీకి. అందుకే ఈ టైటిల్ పెట్టారేమో చెప్పలేం కానీ.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఒక వీడియో విడుదల చేశారు.

ఏ జర్నీ ఆఫ్ విశ్వం అనే పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో మొత్తం షూటింగ్ కు సంబంధించిన కీలకమైన లొకషన్స్, ఎపిసోడ్స్ ను రవీల్ చేస్తున్నట్టుగా ఉంది. అలాగే శ్రీను వైట్ల అనగానే ఖచ్చితంగా గుర్తొచ్చేది వెంకీ సినిమాలోని ట్రెయిన్ సీన్. ఆ ట్రెయిన్ ఎపిసోడ్ ను మరోసారి ఈ మూవీ కోసం రిపీట్ చేశాడని ఈ వీడియోలో ఉంది. అయితే అలాంటి సీన్ నే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరులో చేయాలని చూసి ఫెయిల్ అయ్యాడు ఆ దర్శకుడు అనిల్ రావిపూడి. బట్ క్రియేట్ చేసినవాడే రీ క్రియేట్ చేస్తే ఇంపాక్ట్ వేరే ఉంటుంది కదా. అందుకే ఈ మూవీకి ఈ ఎపిసోడ్ ప్లస్ అవుతుందనే అనుకుంటున్నారు. మొత్తంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ మూవీతో అయినా గోపీచంద్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ సినిమా తేడా కొడితే శ్రీను వైట్ల కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్టే. ఇటు గోపీచంద్ దండయాత్రం కొనసాగుతూనే ఉంటుంది.. అంతే తేడా.

Tags

Next Story