Gopichand : ఘాజీ డైరెక్టర్ తో గోపీచంద్

కొన్నాళ్ల క్రితం ఘాజీ అనే మూవీతో ఆకట్టుకున్నాడు సంకల్ప్ రెడ్డి. చాలా పరిమితమైన బడ్జెట్ తో చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యే థ్రిల్లింగ్ కంటెంట్ అందించాడు. రానా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీతో సంకల్ప్ ఓవర్ నైట్ ఫేమ్ అయ్యాడు. తర్వాత తన స్టైల్ లోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో ‘అంతరిక్షం’ అనే సినిమా చేశాడు. మేకింగ్ పరంగా మెప్పించాన కంటెంట్ పరంగా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదీ మూవీ. దీంతో సంకల్ప్ కు గ్యాప్ వచ్చింది. తర్వాత బాలీవుడ్ లో ఓ సినిమా చేశాడు. ఇదీ వర్కవుట్ కాలేదు. నిజానికి అంతరిక్షం తర్వాత తెలుగు ప్రేక్షకులే కాదు పరిశ్రమ కూడా అతన్ని మర్చిపోయింది. ఈ టైమ్ లో మరోసారి అతని పేరు తెరపైకి రావడం విశేషం అనే చెప్పాలి.
సంకల్ప్ రీసెంట్ గా గోపీచంద్ కు ఓ కథ చెప్పాడట. ఇది గోపీచంద్ కు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడు అంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. దీనికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకుడు అన్నారు. కానీ అది ఇప్పుడప్పుడే సెట్స్ పైకి వెళ్లేలా లేదు అంటున్నారు. అందుకే ఆ డేట్స్ ను సంకల్ప్ కు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. నిజానికి గోపీచంద్ కొన్నేళ్లుగా వరస ఫ్లాపులు చూస్తున్నాడు. కథల ఎంపికలో బాగా తడబడుతున్నాడు. ఇన్ని ఫ్లాపులు వస్తున్నా.. మాస్ అనే మూస ధోరణిని వదలడం లేదు. అందుకే సంకల్ప్ లాంటి వైవిధ్యమైన దర్శకుడికి ఓకే చెప్పాడు అనుకోవచ్చు.
సంకల్ప్ ఇప్పటి వరకూ చేసింది మూడు సినిమాలే అయినా.. అతని శైలి విభిన్నంగా ఉంటుంది. తనకంటూ టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. అయితే ఇటు గోపీచంద్ ఇమేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రెండిటిని కరెక్ట్ గా బ్యాలన్స్ చేసి.. తను చెప్పాలనుకున్నదే చెప్పగలిగితే ఖచ్చితంగా గోపీచంద్ కు ప్లస్ అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com