Gopichand : గోలీమార్ .. ఒన్స్ మోర్

Gopichand :  గోలీమార్ .. ఒన్స్ మోర్
X

ఎవరెన్ని చెప్పినా తెలుగు హీరోల డైమన్షన్స్ ను పూర్తిగా మార్చేసిన దర్శకుడు అంటే పూరీ జగన్నాథ్ అనే చెప్పాలి. అలాంటి పూరీ పీక్స్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ చేసిన సినిమా 'గోలీమార్'. గోపీచంద్, ప్రియమణి జంటగా రోజా ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా అనుకున్నంత పెద్ద హిట్ కాదు. కానీ ఈ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనేది నిజం. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో పాటు గోపీచంద్ కూడా కెరీర్ లో అట్టడుగు స్థానంలో ఉన్నారు. వరుసగా డిజాస్టర్స్ చూస్తున్నారు. అలాంటి కాంబోలో మరో సినిమా అంటే కాస్త ఆశ్చర్యంతో పాటు అవసరమా అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. బట్.. ఎవరు చెప్పొచ్చారు.. ఏ స్క్రిప్ట్ లో ఏ బ్లాక్ బస్టర్ ఉందో..?

ప్రస్తుతం గోపీచంద్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ తర్వాత పూరీ జగన్నాథ్ తో ఓ ప్రాజెక్ట్ ఉండబోతోందని సమాచారం. అయితే ఈ చిత్రం గోలీమార్ కు సీక్వెల్ గా ఉంటుందట. విశేషం ఏంటంటే.. ఈ మూవీని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తాడని టాక్. గోలీమార్ చిత్రాన్ని అప్పట్లో నిర్మించింది కూడా ఈయనే. అయితే అతనూ కొన్నాళ్లుగా నిర్మాణానికి దూరంగా ఉంటున్నాడు. ఇంట్లో ఇద్దరు కొడుకులు హీరోలే అయినా తన బ్యానర్ లో సినిమాలు చేయడం లేదు. అలాంటిది పూరీని,గోపీచంద్ ను నమ్మి ఈ ప్రాజెక్ట్ చేయాలనుకోవడం సాహసమే అని చెప్పాలి. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందంటున్నారు.

Tags

Next Story