Gopichand : గోపీచంద్ విశ్వం టీజర్.. ఓన్లీ ఎంటర్టైన్మెంట్

Gopichand  :  గోపీచంద్ విశ్వం టీజర్.. ఓన్లీ ఎంటర్టైన్మెంట్
X

మేచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ‘విశ్వం’. రెండు అక్షరాలు, చివర్లో సున్నా ఉన్న టైటిల్స్ గోపీచంద్ కు బాగా కలిసొచ్చాయి. లేటెస్ట్ గా విడుదలైన విశ్వం టీజర్ చూస్తుంటే ఈ సారి కూడా కలిసొచ్చేలానే ఉంది అని చెప్పొచ్చు. శ్రీను వైట్ల మూవీ అంటే కామెడీ, యాక్షన్ మిక్స్ డ్ గా కనిపిస్తాయి. కాకపోతే కొన్నాళ్లుగా ఫామ్ లో లేడు. విశ్వంతో తిరిగి ట్రాక్ లోకి వచ్చేలానే ఉన్నాడు. రెండు నిమిషాలకు పైగా ఉన్న టీజర్ లో ఎక్కువ శాతం కామెడీయే కనిపిస్తోంది. ఇది కూడా శ్రీను వైట్ల కామెడీలాగానే నేచురల్ గా కనిపిస్తోంది.

ఒక విలన్ తో ‘ ఔరా సాలే గూట్లే.. నీకు దమ్ముంటే రారా సూసుకుందాం.. కొట్టుకుందాం..’ అంటూ తెలంగాణ పొలిటీషియన్ డైలాగ్ ను చెప్పించారు. గోపీచంద్ తో ఏకంగా ‘కొట్టారు తీసుకున్నాం.. రేపు మాకూ టైమ్ వస్తది.. మేమూ కొడతాం..’అనే జగన్ డైలాగ్ నే చెప్పించారు. ఈ రెండూ పేలాయి కూడా. చివర్లో స్టైలిష్ యాక్షన్ కనిపించింది. ఇది చూస్తే కాస్త దూకుడు మూవీ పేట్రన్ ను గుర్తుకు తెస్తున్నా.. ఈ సారి కనెక్ట్ అయితే మరో హిట్ గ్యారెంటీ అనుకోవచ్చు. ఇక విశేషం ఏంటంటే.. ఈ మూవీని దసరా బరిలో విడుదల చేస్తున్నారు. యస్.. టీజర్ తో పాటు అక్టోబర్ 11న వస్తున్నాం అంటూ రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.

సీనియర్ నరేష్, పవిత్ర పాత్రలు హైలెట్ అయ్యేలా ఉన్నాయి. అలాగే ఈ సారి వెంకీ తరహాలో ఓ ట్రైన్ ఎపిసోడ్ పెట్టాడు శ్రీను వైట్ల. అప్పుడు చాలామందే ఉన్నా.. ఇప్పుడు తమిళ నటుడు విటిజి గణేష్, వెన్నెల కిశోర్ ఈ ఎపిసోడ్ లో నవ్వించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ మూవీ టీజర్ మాత్రం ప్రామిసింగ్ గా ఉందనే చెప్పాలి.

ఇక ఈ మూవీతో హిట్ కొడితే గోపీచంద్, శ్రీను వైట్ల, హీరోయిన్ కావ్య థాపర్ లకు పెద్ద రిలీఫ్ అవుతుంది.

Tags

Next Story