Goreti Venkanna: ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..

Goreti Venkanna (tv5news.in)
Goreti Venkanna: ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. గోరటి వెంకన్నతోపాటు.. తగుళ్ల గోపాల్, దేవ రాజు మహరాజు లకు కూడా అవార్డులు లభించాయి. తగుళ్ల గోపాల్ కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం రాగా.. దేవ రాజు మహరాజు కు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య అవార్డు వచ్చింది.
తెలుగు కవితల విభాగంలో వెంకన్నకు ఈ పురస్కారం దక్కింది. ఈయన రాసిన వల్లంకి తాళం పుస్తకానికి గాను కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. పల్లెలు, ప్రకృతి, కులవృత్తులు..వ్యవసాయంపై గోరటి వెంకన్న మనసుకు హత్తుకునే ఎన్నో పాటలు రాశారు. సామాన్య ప్రజా నీకానికి అర్ధమయ్యే విధంగా ఉండే గోరటి పాటలకు మంచి ప్రజాధరణ ఉంది.
2016 లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా గౌరారం సమీపంలోని తెల్కపల్లిలో నర్సింహ, ఈరమ్మ దంపతులకు గోరటి వెంకన్న 1963లో జన్మించారు. చిన్నప్పటి నుంచి పాటలంటే మక్కువ పెంచుకున్న వెంకన్న.
విద్యార్థి దశ నుంచే గ్రామీణ, ప్రకృతి పరమైన గీతాలు రచించి ఆలపించేవారు. సినీ రచయితగానూ పలు సిమిమాలకు పాటలు రాశారు. విచ్ఛిన్నమైపోతున్న పల్లె జీవనాన్ని కళ్లకు కట్టాడు ప్రజా గాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న. ఇలా అనేక సినిమాల్లోను తనదైన శైలిలో పాటలు రాసి ప్రజాధరణ పొందారు. తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ.. జై బోలో అమర వీరులకు జై బోలో అనేపాట ఇప్పటికి జనం నాలుకలపై నానుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com