EPIC - First Semester : ఎపిక్ నుంచి గోరేటి వెంకన్న పాట రిలీజ్ చేశారు

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న మూవీ ఎపిక్. ఈ టైటిల్ కు పూర్తి భిన్నమైన పాట ఒకటి విడుదల చేసింది మూవీ టీమ్. మామూలుగా ఈ టైటిల్ చూసి చాలామంది ఈ టైప్ లో ఉండే పాట అనుకుంటారు. అంతే కాక ఈ పాట సాగుతుంది లండన్ లో. ఇంకేం ఆ స్థాయిలో ఉండాలి పాట అని భావిస్తారు. బట్ అందుకు పూర్తి విరుద్ధంగా గోరేటి వెంకన్న రాసిన పాట విడుదల చేసింది టీమ్. మరి ఈ పాటను సెలెక్ట్ చేసింది ఎవరు అంటే.. 90స్ అనే మూవీతో ఆకట్టుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్. అతనే ఈ చిత్రానికి దర్శకుడు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీత దర్శకుడు.
‘సంచారమే ఎంతొ బాగున్నది దీనంత ఆనందం ఏమున్నది.. ఊరునిడిచి గాలిమోటారెక్కినాది.. మోటు మనుషులనిడిచి స్వీటు మనుషుల జేరి మనసును అమ్ముకున్నది ఎంకటేశ్వర స్వామి నడిమిట్ల కలిసేనా ప్రేమలో కలిసినాది.. సంచారమే..’ అంటూ సాగే గీతం ఇది. ఈ పాటకు తగ్గట్టుగా ఉండేలా కొరియోగ్రఫీ కనిపిస్తోంది. అలాగని స్టెప్పులేం లేవు. లండన్ లోని కొన్ని ఏరియాస్ ను కూడా కలిసేలా సాగే సాహిత్యం ఆకట్టుకుంది. చివర్లో గోరేటి కూడా పాడాడు. చాలా బావుందీ పాట.
ఇక ఈ పాటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. పాటంతా కేవలం ఒకటే కాస్ట్యూమ్ లో ఉంటారు ఇద్దరు. అంటే ఒక రోజులోనే వీరంతా సాగించిన సంచారమే ఉండేలా ఉందీ పాటలో. మొత్తంగా బ్యూటీఫుల్ సాంగ్ అనుకోవచ్చు. తెలంగాణ నేపథ్యంలో సాగే పాటలా ఉంటుంది. బట్ ఇది సినిమా కోసం కొన్ని మార్పులు చేశారు. ఏదేమైనా ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ అంటూ పరిచయం చేసిన పాట మాత్రం చాలా బావుందనే చెప్పాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
