Balakrishna : తిరుమలలో బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకల హంగామా

Balakrishna :  తిరుమలలో బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకల హంగామా
X

పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ 65వ జన్మదినం తిరుమలలోని అఖిలాండం వద్ద ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బి. శ్రీధర్ వర్మ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా 650 కొబ్బరికాయలు పగలగొట్టి, 6.5 కిలోల కర్పూరంతో గ్రాండ్ హారతి ఇచ్చారు. శ్రీధర్ వర్మ మాట్లాడుతూ, బాలయ్య సినిమాలతో పాటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు అద్భుత వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని తిరుమల వెంకన్నను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో రుపేష్ వర్మ, సుబ్బు ఇతర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. బాలయ్య జన్మదినం సందర్భంగా భక్తి, ఉత్సాహం, జోష్‌తో నిండిన ఈ కార్యక్రమం తిరుమలలో అద్భుతంగా నిలిచింది. బాలకృష్ణ అభిమానులకు ఈ వేడుకలు పండగలా మారాయి.

Tags

Next Story