Vishwak Sen: విశ్వక్ సేన్‌ను సపోర్ట్ చేసిన సీరియల్ నటి.. గౌరవం పెరిగిందంటూ..

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. తన అప్‌కమింగ్ సినిమా 'అశోకవనంలో అర్జున కళ్యాణం' ప్రమోషన్ కోసం చేసిన ఓ ప్రాంక్ వీడియో దగ్గర ప్రారంభమయిన రచ్చ.. టీవీ ఛానెల్ వరకు వెళ్లింది. అయితే విశ్వక్ సేన్‌కు ఎదురైన ఘటనలో కొంతమంది తనదే తప్పు అంటుండగా.. చాలామంది మాత్రం విశ్వక్ సేన్‌కు సపోర్ట్ చేస్తు్న్నారు. తాజాగా ఓ సీరియల్ నటి కూడా విశ్వక్ సేన్‌కు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది.
విశ్వక్ సేన్ హీరోగా 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై విశ్వక్ చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. ఇప్పటికే పలుమార్లు తాను నటించిన పాత్రలలో ఇదే తన ఫేవరెట్ అని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఓ డిబేట్‌లో జరిగిన వాగ్వాదంపై మాట్లాడుతూ అందులో తన తప్పు ఏమీ లేదన్నాడు విశ్వక్ సేన్.
గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి శంకర్ సైతం విశ్వక్ సేన్‌కు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసంది. 'నేను హిట్ సినిమా చూసి విశ్వక్ సేన్‌ను ఇష్టపడ్డాను. నేను ఈరోజు మరో వీడియో చూసిన తర్వాత విశ్వక్ సేన్‌పై గౌరవం పెరిగింది. ఆ టీవీ ఛానెల్ ఇచ్చినంత పబ్లిసిటీని విశ్వక్‌కు ఇంకే ప్రాంక్ తెచ్చిపెట్టేది కాదు. ఇలాంటి సెల్ఫ్ మేడ్ స్టార్‌కు తన కొత్త మూవీ కోసం ఆల్ ది బెస్ట్' అని తెలిపింది కస్తూరి. తనతో పాటు మరెందరో సెలబ్రిటీలు విశ్వక్‌కు సపోర్ట్‌గా నిలిచారు.
I watched HIT and liked #VishwakSen
— Kasturi Shankar (@KasthuriShankar) May 2, 2022
Today I watched a video and RESPECT @VishwakSenActor .
No prank cud have got him the publicity that TV9 has generated for him!
All the best to a self made star and his new movie #AshokaVanamLoArjunaKalyanam @Vishwaksen_Team pic.twitter.com/5FMQaKemF0
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com