Guntur Karam 2nd Look : మరో న్యూ లుక్ పోస్టర్ రివీల్.. మహేశ్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్

Guntur Karam 2nd Look : మరో న్యూ లుక్ పోస్టర్ రివీల్.. మహేశ్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్
'గుంటూరు కారం' నుంచి మరో క్రేజీ పోస్టర్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ మాస్ మూవీ ;గుంటూరు కారం'. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, సునీల్, ఆలీ, రఘుబాబు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు నటిస్తోన్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తోన్న 'గుంటూరు కారం' నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మాస్ స్ట్రైక్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకోగా నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మహేష్ బాబు లుంగీ కట్టిన మాస్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. తాజాగా మరో క్రేజీ పోస్టర్ ను వదులుతూ.. మేకర్స్.. అభిమానులకు మరో ఇంట్రస్టింగ్ స్ర్ఫైజ్ ఇచ్చారు. దీంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మహేశ్ బాబు పుట్టినరోజు (ఆగస్టు 9) సందర్భంగా మేకర్స్ ఓ క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మొత్తానికి ఆయన బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ను ఇచ్చారు మేకర్స్. మొదటగా రిలీజ్ చేసిన పోస్టర్ లో మహేశ్.. లుంగీ, పైన షర్టు ధరించి గాగుళ్స్ పెట్టుకుని సిగరెట్ వెలిగిస్తూ కనిపించారు. నేచురల్ లుక్ లో కనిపిస్తోన్న మహేశ్ ఫస్ట్ లుక్ ఇప్పటికే ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇక తాజాగా రివీల్ చేసిన పోస్టర్ లో నుదుట ఎర్రటి రుమాలు కట్టుకుని, గాగుళ్స్ పెట్టుకుని స్టైల్ గా కనిపించారు. చుట్టూ రౌడీ గాళ్లు చుట్టుముట్టినట్టుగా కూడా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. ఫైనల్ గా ఈ పోస్టర్ ను చూస్తుంటే.. ఇది ఓ ఫైట్ సన్నివేశంలోని క్లిక్ గా తెలుస్తోంది. మార్నింగ్ వచ్చిన మాస్ లుక్, ఇప్పుడు వచ్చిన స్టైల్ లుక్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ రెండు పోస్టర్లతో మేకర్స్.. సినిమాపై మరింత క్యూరియాసిటీ రేకెత్తించేలా చేశారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో దిరిపోయే ఐటెం సాంగ్‌ను కూడా పెడుతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది బడా, స్మాల్ హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదనే చెప్పాలి. ఇక ప్రస్తుతం మహేశ్.. వెకేషన్‌లో ఉన్నాడు. వచ్చిన తర్వాత 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన షూటింగ్ పున: ప్రారంభం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. అప్పటి నుంచి ఎలాంటి బ్రేకులు లేకుండా మూవీ పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్లు చేసుకుంటుందని సమాచారం.


Tags

Read MoreRead Less
Next Story