Guntur Karam : మహేశ్ బాబు బర్త్ డే కి ‘గుంటూరు కారం’ సూపర్ గిఫ్ట్ ?
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటేస్ట్ సినిమా 'గుంటూరు కారం' ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకుంది. ఈ మూవీలో మహేష్ బాబు కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తుండగా కీలక పాత్రల్లో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జయరాం, రఘుబాబు నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న 'గుంటూరు కారం' నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ స్ట్రైక్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచింది. ఇటీవల షూట్ కి కొంత గ్యాప్ ఇచ్చిన హీరో మహేష్ బాబు ప్రస్తుతం ఫామిలీ తో విదేశాల్లో వెకేషన్ లో ఉన్నారు.
కాగా ఈ నెక్స్ట్ షెడ్యూల్ ని ఆగష్టు రెండవ వారంలో ప్రారంభించనున్నారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈమూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. మరోవైపు థమన్ దీనికి అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ని అలరించేలా దర్శకుడు త్రివిక్రమ్ ఈ మూవీ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని టాక్. కాగా 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగించి 2024లో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
'గుంటూరు కారం' సినిమాలో ముందుగా హీరోయిన్ పూజా హెగ్డేను అనుకున్నారని, కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని అప్పట్లో టాక్ నడిచింది. పూజా ఈ సినిమా కోసం దాదాపుగా రూ. 4 కోట్లు డిమాండ్ చేయడంతో ఆమెను టీమ్ తప్పించిందనే వార్తలూ వినిపించాయి. దీంతో ఆమె స్థానంలో శ్రీలీలను మేయిన్ హీరోయిన్‌గా తీసుకున్నారట. సెకండ్ లీడ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఆమె షూట్‌లో పాల్గొంటుండగా.. అనేక వివాదాల నడుమ ఈ సినిమా ఇప్పుడే ట్రాక్‌లోకి వచ్చింది. అందులో భాగంగా రీసెంట్ టీమ్ ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మహేష్ లండన్‌లో ఉన్నారు.. రాగానే కొత్త షెడ్యూల్ షురూ కానుంది.
ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. మహేష్ బాబు ఆగష్టు 9న తన 48వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజున ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్‌ను విడుదల చేస్తున్నారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాటు మహేష్ నటించిన బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ అదే రోజున ఉండనుంది. ఇకపోతే మహేష్ రాజమౌళిల కాంబినేషన్‌లో వస్తున్న SSMB 29 నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవచ్చని అంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com