గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ..

గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ..
త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కలయికలో చిత్రం వస్తుందంటే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కలయికలో చిత్రం వస్తుందంటే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఒకరు అభిమాన దర్శకుడు అయితే, మరొకరు అభిమాన హీరో.. టైటిల్ కూడా చాలా స్పైసీగా ఉంది. ట్రయిలర్ అభిమానులను థియేటర్ వైపుకు పరుగులు పెట్టించింది. సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చిన గుంటూరు కారం ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే వీక్షించిన ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అభిమానులు మహేష్ బాబు నటనను ప్రశంసించారు.

విడుదలైన కొద్ది గంటలకే, చాలా మంది ప్రారంభ వీక్షకులు మరియు సినీ ప్రేక్షకులు మహేష్ బాబు చిత్రం గుంటూరు కారంపై తమ సమీక్షలు, అనుభవాలను పంచుకున్నారు. చాలా మంది అభిమానులు ఈ చిత్రాన్ని మహేష్ బాబు కోసం మాత్రమే చూడాలి అని అంటున్నారు.

ఇదే విషయాన్ని ఒక యూజర్ ట్వీట్ చేస్తూ, “బిలో యావరేజ్ ఫ్లిక్ #గుంటూరు కారం మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. గుంటూరు కారం స్పైస్‌లెస్‌గా మిగిలిపోయింది, మీరు దీన్ని బాబు కోసం చూడవచ్చు.

సినిమా కథాంశం గురించి ఒక వినియోగదారు ట్వీట్ చేస్తూ, “ఫస్ట్ హాఫ్ పూర్తయింది #గుంటూరుకారం మహేష్ అన్న బాగుంది కానీ కథలో పస లేదు” అని పేర్కొన్నారు.

గుంటూరు కారంను వన్ మ్యాన్ షోగా పేర్కొంటూ, మరో వినియోగదారు ట్వీట్ చేస్తూ, “మహేష్ ది యాక్టర్ వన్ మ్యాన్ షో. ఈ చిత్రాన్ని పూర్తిగా ఆస్వాదించాము, ప్రతి ఫ్రేమ్‌లో అతని హార్డ్‌వర్క్, అంకితభావాన్ని మనం చూడవచ్చు అని తెలిపాడు.

గుంటూరు కారం గురించి

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం చిత్రాన్ని ఎస్. రాధా కృష్ణ నిర్మించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, జయరామ్ మరియు బ్రహ్మానందం నటించారు.

Tags

Read MoreRead Less
Next Story