Gurram Paapi Reddy : ఫన్ రైడ్ లా గుర్రం పాపిరెడ్డి టీజర్ ..

Gurram Paapi Reddy :  ఫన్ రైడ్ లా గుర్రం పాపిరెడ్డి టీజర్ ..
X

వినోదాన్ని నమ్ముకున్న మేకర్స్ మాగ్జిమం విజయాలే సాధించారు. అందుకు టాలీవుడ్ లో అనేక ఉదాహరణలున్నాయి. చిన్న సినిమాల్లో మంచి కామెడీ ఉండి, ప్రాపర్ గా ప్రమోట్ చేసుకుంటే హిట్ గ్యారెంటీ అనేది అందరికీ తెలుసు. అలాంటి కంటెంట్ తోనే వస్తున్నాడు ‘గుర్రం పాపిరెడ్డి’. ఈ టైటిల్ పాత్రలో నరేష్ అగస్త్య నటించాడు. కృష్ణ మనోహర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ విడుదలైంది.

గుర్రం పాపిరెడ్డి టీజర్ ఆద్యంతం హిలేరియస్ గా ఉంది. ఓ నిధి అన్వేషణ నేపథ్యంలో సాగే డార్క్ క్రైమ్ కామెడీ కథలా కనిపిస్తోంది. హీరో తన అతి తెలివితో ఏదో సాధించాలని అన్వేషణలు చేయడం అతనికి బకరాల్లా కనిపించే ఫ్రెండ్స్ సాయం చేయడానికి రావడం వారి మధ్య క్రియేట్ అయ్యే కామెడీతో సినిమా నవ్వించబోతోంది అని అర్థం అవుతోందీ టీజర్ చూస్తుంటే. అఫ్ కోర్స్ ఈ మధ్య ట్రెండ్ లాగానే వీళ్లు కూడా టీజర్ లోనే బూతులను ఈజీగా వదిలేశారు. మధ్యోలో ఆపేసినట్టు కనిపించినా.. అదేంటో అర్థం అవుతుంది.

నరేష్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా కనిపిస్తోంది. కీలక పాత్రల్లో బ్రహ్మానందం, యోగిబాబు, రాజ్ కుమార కసిరెడ్డి, వంశీధర్ కొస్గి, జీవన్ కుమార్ తదితరులు కనిపిస్తున్నారు. వీళ్లంతా మంచి టైమింగ్ ఉన్నవాళ్లే కావడం విశేషం. ఇక బ్రహ్మానందం జాతిరత్నాలు తరహాలో మరోసారి జడ్జ్ గా నవ్వించబోతున్నాడని టీజర్ తో తెలుస్తోంది.

Tags

Next Story