Gurram Papireddy : గుర్రం పాపిరెడ్డి ట్రైలర్ తోనే తేడా కొట్టేలా ఉందిగా

Gurram Papireddy :  గుర్రం పాపిరెడ్డి ట్రైలర్ తోనే తేడా కొట్టేలా ఉందిగా
X

చిన్న చిన్న కాన్సెప్ట్స్ తో వస్తోన్న మూవీస్ ఈ మధ్య ఆకట్టుకోవడం లేదు. కొన్ని మాత్రమే సంఖ్యగా చెబుతున్నారు తప్ప.. అలా వచ్చినవేవీ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అలా వస్తోన్న మూవీనే గుర్రం పాపిరెడ్డి అనిపించేలా ఉంది ట్రైలర్ చూస్తుంటే. నిజానికి ఈ మూవీ మొదటి నుంచి కొంత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. టీజర్ తో ఆకట్టుకుంది. ప్రమోషన్స్ తో ఓ రేంజ్ లో వచ్చేస్తోంది. ముందుగా అయితే ఈ నెల 12నే విడుదల కావాల్సి ఉంది. అఖండ2 తో ఒక వారం ఆలస్యంగా రిలీజ్ అవుతోంది. అదే రోజున అవతార్ 3 కూడా విడుదల కాబోతోంది. అయినా వీళ్లు మాత్రం ఆ రిలీజ్ డేట్ కే వేశారు. ట్రైలర్ విడుదల చేయాలనుకున్నారు. చేశారు. బట్ అసలుకే ఎసరు వచ్చింది ట్రైలర్ తోనే అనిపించేసింది.

ట్రైలర్ పెద్దగా ఆకట్టుకునేలా లేదు. కామెడీ క్రైమ్ గా సినిమా కనిపిస్తోంది. ‘నా పేరు జిజి వైద్యనాథన్’ అనే బ్రహ్మానందం డైలాగ్ తో మొదలవుతోంది. ట్రైలర్ మొత్తంలో బ్రహ్మీ కూడా కనిపించాడు. కానీ అతను కేవలం ఒక్క సీన్ లో మాత్రమే కనిపిస్తాడు అనిపించేలా ఉన్నాడు. శ్రీశైలం అడవుల్లోకి వెళ్లిన టీమ్ అంటూ చనిపోయిన అనిపించేలా వాళ్ల టీమ్ తో ఆడించే కథనంలా ఉంది. ట్రైలర్ తోనే చాలా స్లోగా ఉంది మూవీ అనిపించేలా ఉంది.

నరేష్ అగస్త్య హీరోగా నటించినట్టుగా కనిపిస్తున్నాడు.. కానీ మిగతా టీమ్ అంతా పెద్ద ప్రాధాన్యం ఇచ్చేలా ఉంది. ఇక ఫరియా అబ్దుల్లా హీరోయిన్ కు ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తక్కువ అనిపించేలా ఉంది. తమిళ్ నుంచి యోగిబాబును కూడా దించారు. అతను ఫుల్ బిజీగా ఉన్నాడు. అయినా అతన్ని లాగారు అంటే మూవీలో పెద్ద క్యారెక్టర్ లా ఉందే అనిపించారు. సింపుల్ గా చెబితే గుర్రం పాపిరెడ్డి ట్రైలర్ తో మాత్రం ఇబ్బంది పడబోతున్నట్టుగా కనిపిస్తోంది. మరి సినిమా కూడా అలాగే ఉంటే.. అంతే సంగతులు.. లేదూ కంటెంట్ బావుందీ అంటే ఇంత కష్టపడ్డందుకు ఉపయోగపడుతుంది. బట్ ట్రైలర్ మాత్రం నిజంగానే బాలేదు.

Tags

Next Story