Sree Vishnu Swag : శ్రీ విష్ణు స్వాగ్ నుంచి గువ్వ గూటిలో సాంగ్
కొన్నాళ్లుగా కామెడీ కథలతో కాసులు కొల్లగొడుతున్నాడు శ్రీ విష్ణు. రాజ రాజ చోర, సామజవరగమన, ఓమ్ భీమ్ బుష్ ఈ కోవలోకే వస్తాయి. తాజాగా మరోసారి ఆ తరహా కామెడీ కంటెంట్ తోనే వస్తున్నాడు శ్రీ విష్ణు. స్వాగ్ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ కు హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది. అనాది నుంచి ఆడ, మగ మధ్య ఉన్న వైరం అనే కోణంలో ఎవరు గొప్ప అనే అంశాన్ని కామెడీగా చెప్పబోతున్నారని అర్థం అవుతోంది. రాజ రాజ చోర ఫేమ్ హసిత్ గోలి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా స్వాగ్ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
మనో, గీతా మాధురి పాడిన ఈ పాట వింటేజ్ మూవీ సాంగ్స్ ను గుర్తు చేస్తోంది. యయాతి డ్యాన్స్ ట్రూప్ ద్వారా శ్రీ విష్ణు టీమ్ ఇచ్చే ప్రదర్శనల్లో వచ్చే పాటలా ఉంది. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన ఈ గీతాన్ని భువన చంద్ర రాయడం విశేషం. మనో తనదైన శైలిలో ఎనర్జిటిక్ గా ఆలపించాడు. ఇక ఈ సాంగ్ లో కనిపించిన సెట్స్, కాస్ట్యూమ్స్, లైటింగ్స్ ఇవన్నీ 80ల కాలంలో వచ్చిన పాటలను తలపిస్తున్నాయి. అయితే టీజర్ చూసిన తర్వాత ఇదంతా సీరియస్ గా తీసుకోవాల్సిన మేటర్ కాదని అర్థం చేసుకోవచ్చు.సినిమాలో వచ్చే ఏదైనా కామెడీ సీన్ కు కంటిన్యూషన్ లాంటి పాటే ఇదనుకోవచ్చు.
స్వాగ్ లో శ్రీ విష్ణుతో పాటు రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, సునిల్, శరణ్య ప్రదీప్, రవిబాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 4న దసరా శెలవుల సందర్భంగా స్వాగ్ విడుదల కాబోతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com