GV Prakash Achieves Milestone : 100వ చిత్రానికి కంపోజింగ్ చేస్తోన్న జివి ప్రకాష్

GV Prakash Achieves Milestone : 100వ చిత్రానికి కంపోజింగ్ చేస్తోన్న జివి ప్రకాష్
X
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం.. వందో చిత్రంగా రికార్డ్

ఒకప్పుడు హీరోలు వందల సినిమాలు చేసేవారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడాదికి ఐదు నుంచి పదిహేను సినిమాలు విడుదల చేసే హీరోలు చాలా మంది ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు రెండేళ్లకో, మూడేళ్లకో సినిమా చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హీరోలు తమ కెరీర్ మొత్తంలో కొన్ని సినిమాలు చేస్తే అది గొప్ప విషయం. హీరోలే కాదు హీరోయిన్లు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లదీ అదే పరిస్థితి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మరికొందరు మాత్రం ఆశ్చర్యపోయే విధంగా వారి సినిమాల సంఖ్యను పెంచేస్తున్నారు. సంగీత దర్శకుడు జివి ప్రకాష్ ఇప్పుడు తన వేగంతో వార్తల్లో నిలిచాడు. 19 ఏళ్లకే సంగీత దర్శకుడిగా అడుగుపెట్టి ఇరవై ఏళ్లకే సూపర్ స్టార్ సినిమాకు సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నాడు. జివి ప్రకాష్‌కి 36 ఏళ్లు నిండినప్పటికీ ఆయన సినిమాల సంఖ్య ఇప్పుడు 100కి చేరుకుంది.

సుధా కొంగర దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రకటించడంతో పాటు, ఈ సినిమా తనకు నచ్చిన 100వ సినిమా అని కూడా అని సూర్య తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇండస్ట్రీలోకి రావడం తేలికే అయినా.. అలాంటి రికార్డులు సాధించాలి. జి.వి.ప్రకాష్ ఆ కోవకు చెందినవాడనడంలో సందేహం లేదు.

ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్‌, ఎందుకంటే ప్రేమంట వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఆల్బమ్స్‌ ఇచ్చిన జివి ప్రకాష్.. ఓ వైపు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సూపర్ ఫామ్‌లో ఉంటూనే మరో వైపు హీరోగా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో దూసుకుపోతున్నాడు. తాజాగా జీవి తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను ప్రకటించాడు. కింగ్‌స్టన్‌ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసి అల్టిమేట్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశాడు. సముద్రంలో పడవపై నిల్చుని ఎదురుగా వస్తున్న భారీ అలకు బల్లెంను విసురుతున్నట్లు ఆసక్తికరంగా పోస్టర్‌ను డిజైన్‌ చేశారు. అదీకాకుండా ఆ అల మొత్తం పుర్రెలతో పోయింది. దీన్ని బట్టి చూస్తే ఇదోక హార్రర్‌ థ్రిల్లర్‌ అని తెలుస్తుంది. అంతేకాకుండా సబ్‌ టైటిల్‌లో శపించబడిన సముద్రం అంటూ రాసుకొచ్చారు.

Next Story