Madha Gaja Raja : నెలాఖరులో అరడజను సినిమాలు

Madha Gaja Raja :  నెలాఖరులో అరడజను సినిమాలు
X

కొత్త యేడాది వచ్చిందంటే అందరి చూపూ సంక్రాంతి వైపే ఉంటుంది. అందుకే పండగ ముందు, తర్వాత వచ్చే సినిమాలను మరీ అంత సీరియస్ గా తీసుకోరు. ఒకవేళ పెద్ద స్టార్స్ వస్తే తప్ప. ఈ జనవరి లో సంక్రాంతికి ముందు, తర్వాతా కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా లేరు. ముఖ్యంగా పండగ తర్వాత చాలా వాక్యూమ్ ఉన్నా.. ఎవరూ ఉపయోగించుకోలేదు. గత వారం నాలుగైదు సినిమాలు వచ్చాయి. బట్ ఆ చిత్రాల గురించి పట్టించుకున్నవారే లేరు. ఇక నెలాఖరులో కూడా అరడజను సినిమాలు విడుదల కాబోతున్నాయి. బట్ వీటి గురించి కూడా జనానికి పెద్దగా తెలియదు. అంటే ప్రమోషన్స్ ఎంత వీక్ గా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ మూవీస్ లో మూడు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి.

జనవరి 30న తమిళ్ లో సంక్రాంతికి విడుదలయిన నేసిప్పయ చిత్రాన్ని తెలుగులో ప్రేమిస్తావా పేరుతో విడుదల చేస్తున్నారు. అదితి శంకర్, ఆకాశ్ మురళీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని పంజా ఫేమ్ విష్ణు వర్ధన్ డైరెక్ట్ చేశాడు. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

ఇక 12యేళ్ల క్రితమే పూర్తయి ఈ సంక్రాంతికి తమిళ్ లో విడుదలైన విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన మధగజరాజా ౩౧న విడుదలవుతోంది. సుందర్ సి డైరెక్ట్ చేసిన ఈ మూవీ తమిళ్ లో అనూహ్యంగా బ్లాక్ బస్టర్ అయింది. అందుకే తెలుగులోనూ విడుదల చేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ క్యాంప్ తో ఎక్కువ ఫేమ్ అయిన అప్సరా రాణి, వరుణ్ సందేవ్, విజయ్ శంకర్ కీలక పాత్రల్లో నటించిన రాచరికం అనే చిత్రం 31న రిలీజ్ అవుతోంది. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. కంటెంట్ బేస్డ్ మూవీలా కనిపిస్తోంది.

ఇక ఇవి కాక అంతా కొత్తవాళ్లు నటించిన మహిష అనే మూవీ 31న, రొమాంటిక్ లైఫ్ అనే సినిమా ఫిబ్రవరి 1న విడుదలవుతోంది. వీటితో పాటు 31న ఏజెంట్ గయ్ అనే హాలీవుడ్ మూవీ కూడా డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ అవుతోంది. సో.. మొత్తం అరడజను సినిమాలు. వీటిలో దేనికీ పెద్దగా హైప్ లేదు. ఉన్నంతలో మధగజరాజా, రాచరికం మాత్రం కాస్త ఆకట్టుకునేలా ఉన్నాయి.

Tags

Next Story