Bigg Boss 5 Telugu: హమీదా ఎలిమినేట్.. హౌస్‌మేట్స్ అందరిలో ఎక్కువగా బాధపడింది..

hamida (tv5news.in)
Bigg Boss 5 Telugu: నవరాత్రి ప్రారంభయిన సందర్భంగా బిగ్ బాస్ హౌస్‌లో పండగ వాతావరణం నెలకొంది. శని, ఆదివారాలు నాగార్జునతో పాటు పలువురు సెలబ్రిటీలు బిగ్ బాస్ స్టేజీపై సందడి చేసారు. హౌస్‌మేట్స్ అంతా దుర్గాదేవి పూజా చేసారు. పండగ సందర్భంగా రెండు రోజులు ఏ గొడవ లేకుండా బిగ్ బాస్ హౌస్ అంతా ప్రశాంతంగా మారిపోయింది. కానీ అన్నింటి మధ్యలో ఎలిమినేషన్ కూడా జరిగింది. ఈవారం బిగ్ బాస్ హౌస్ నుండి హమీదా బయటికి వచ్చేసింది.
హమీదా.. ఈ పేరు పెద్దగా బయట ప్రేక్షకులకు తెలీదు. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి రాగానే ఒక్కసారిగా ఈ పేరు ఫేమస్ అయిపోయింది. హౌస్‌లో గ్లామర్‌ను యాడ్ చేస్తూ, టాస్క్‌లలో తన వల్ల అయిన బెస్ట్‌ను అందిస్తూ హమీదా ఎప్పుడూ ప్రేక్షకులను అలరించడానికే ప్రయత్నించేది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరినీ కట్టిపడేసి ఎంతోమంది అబ్బాయిలకు క్రష్‌గా మారిపోయింది హమీదా.
బిగ్ బాస్ హౌస్‌లో బాండింగ్స్ కామనే. అలా హమీదా, శ్రీరామచంద్ర ఈ హౌస్ వల్ల చాలా దగ్గరయ్యారు. వీరిద్దరు లవ్ బర్డ్స్ అంటూ ప్రేక్షకులు వదంతులు కూడా మొదలుపెట్టేసారు. అయితే హమీదా ఎలిమినేట్ అవ్వడం తట్టుకోలేని శ్రీరామ్ తనను పట్టుకుని బాగా ఏడ్చేసాడు. కానీ హమీదా మాత్రం తాను చాలా తృప్తిగానే హౌస్ నుండి వెళ్తున్నట్టు చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com