Hamsa Nandini: 'ఇంకా గెలవలేదు'.. క్యాన్సర్‌పై హంసా నందిని స్పందన

Hamsa Nandini (tv5news.in)
Hamsa Nandini: సినీ పరిశ్రమలో ఇప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీలు క్యాన్సర్ బారినపడ్డారు.అందులో చాలావరకు కోలుకున్నారు కూడా. అయితే వారు క్యాన్సర్ నుండి ఎలా కోరుకున్నారు అని ప్రేక్షకులతో పంచుకుంటూ.. తమలాంటి వారికి ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో వారు ముందుంటారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి హంసా నందిని కూడా యాడ్ అయ్యింది.
టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా, మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది హంసా నందిని. పలువురు స్టార్ హీరోలతో కూడా జతకట్టింది. అలాంటి హంసా నందిని కొన్నాళ్ల క్రితం తనకు క్యాన్సర్ వచ్చిందంటూ ప్రకటించింది. సోషల్ మీడియాలో తన భావాలను కూడా ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఇక ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న హంసా.. చాలారోజుల తర్వాత తన క్యాన్సర్ గురించి మరొక పోస్ట్ చేసింది.
'16 సైకిల్స్‌లో కీమో థెరపీ అయిపోయింది. నేను ఇప్పుడు అఫీషియల్‌గా ఒక కీమో సర్వైవర్‌ని. కానీ అప్పుడే అంతా అయిపోలేదు. నేను ఇంకా గెలవలేదు. తరువాతి యుద్ధానికి సిద్ధం అవ్వడానికి ఇదే సమయం. ఇది సర్జరీల సమయం.' అంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సమయంలో తన ఫోటోను పోస్ట్ చేసింది. కీమో థెరపీ గురించి, క్యాన్సర్ గురించి ఇలా మామూలుగా మాట్లాడడం వల్ల తనలాంటి చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తుందని తన అభిమానులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com