Hansika: పెళ్లి సమయంలో తల్లి మాటలు.. కన్నీళ్లు పెట్టుకున్న హన్సిక

Hansika: పెళ్లి సమయంలో తల్లి మాటలు.. కన్నీళ్లు పెట్టుకున్న హన్సిక
Hansika: నటి హన్సిక తన వివాహ వేడుకకు సంబంధించి లవ్ షాదీ డ్రామా పేరుతో హాట్ స్టార్ వేదికగా ఓ సిరీస్‌ని తీసుకువచ్చింది.

Hansika: నటి హన్సిక తన వివాహ వేడుకకు సంబంధించి లవ్ షాదీ డ్రామా పేరుతో హాట్ స్టార్ వేదికగా ఓ సిరీస్‌ని తీసుకువచ్చింది. ఇది రెండు వారాల నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఇందులో హన్సిక తన చిన్ననాటి సంగతులను, పెళ్లి విషయాలను పంచుకున్నారు. ప్రతి ఫ్రేమ్‌ని ఓ అపురూప దృశ్యకావ్యంగా మలిచారు నిర్వాహకులు. తాజా ఎపిసోడ్‌లో పెళ్లి వేడుకకు సంబంధించిన విషయాలను చూపించారు. గత ఏడాది డిసెంబర్ 4న వివాహబంధంలోకి అడుగుపెట్టిన హన్సిక తన స్నేహితుడు సోహైల్‌ను పెళ్లి చేసుకుంది. ఈ ఎపిసోడ్‌లో పెళ్లికి ముందు హన్సిక కుటుంబంలో జరిగిన అమ్మవారి పూజా కార్యక్రమం, వెడ్డింగ్ డ్రెస్ షాపింగ్ వంటివి చూపించారు.

ఇందులో భాగంగా కన్యాదానం విషయంలో తల్లి తీసుకున్న నిర్ణయం హన్సికకు కన్నీళ్లు తెప్పించింది. ప్రతి అమ్మాయికి ఆత్మగౌరవం ఎంతో ముఖ్యం. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఎన్నో ఇబ్బందులు దాటి, విమర్శలను ఎదుర్కొని.. ఈ స్థాయికి వచ్చావు. ఇక నీ పెళ్లికి సంబంధించి నేను ఓ నిర్ణయం తీసుకున్నాను.. అదేమిటంటే నువ్వేమీ వస్తువు కాదు నిన్ను వేరొకరికి దానం ఇవ్వడానికి.. కన్యాదానం బదులు గోదానం చేస్తాను. అలాగే పెళ్లైనా నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి కుమార్తెవే అని తల్లి పలికిన మాటలతో హన్సిక తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తల్లి తీసుకున్న నిర్ణయం తనకెంతో నచ్చిందని, ఇది చాలా గొప్ప విషయం అని ఆమె అన్నారు.

Tags

Next Story