Hansika Motwani: హన్సిక ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. ఆనందంలో కాబోయే దంపతులు..

Hansika Motwani: హన్సిక మోత్వాని మరియు సోహెల్ ఖతురియాల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.
నిన్న రాత్రి జరిగిన మాతా కీ చౌకీ ఫంక్షన్‌లో హన్సిక మోత్వాని, సోహెల్ ఖతురియా ఎరుపు రంగు దుస్తులు ధరించారు. హన్సిక తన కాబోయే భర్త సోహెల్ ఖతురియాను డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతోంది. నవంబర్ 22న ముంబైలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.
హన్సిక, సోహెల్, సోదరుడు ప్రశాంత్ మోత్వానితో కలిసి ఫోటోకు పోజులిచ్చారు. 14వ శతాబ్దంలో నిర్మించిన జైపూర్‌లోని ముండోటా కోటలో హన్సిక మోత్వాని, సోహెల్ ఖతురియాల వివాహం జరగనుందని సమాచారం.
మెహందీ వేడుక డిసెంబర్ 3 న జరుగుతుంది. హల్దీ వేడుక డిసెంబర్ 4 న జరుగుతుంది. వివాహంతో పాటు, అతిథులు క్యాసినోకు కూడా హాజరవుతారు. డిసెంబర్ 4 సాయంత్రం పార్టీ నిర్వహిస్తున్నారు ఇరువురి కుటుంబసభ్యులు. పారిస్‌లోని ఈఫిల్ టవర్ ముందు సోహెల్ ఖతురియా హన్సికకు ప్రపోజ్ చేశాడు. నౌ & ఫరెవర్ అనే క్యాప్షన్‌తో హన్సిక సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com