Hansika Motwani : సమంత రూట్ లోనే హన్సిక

Hansika Motwani :  సమంత రూట్ లోనే హన్సిక
X

ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలైంది. తాము విడాకులు తీసుకోబోతున్నారు అనే విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోస్ డిలీట్ చేయడం. అది మొదలు పెట్టింది సమంతనే. ముందుగా సమంతనే నాగ చైతన్యతో తీసుకున్న ఫోటోస్ అన్నీ వదిలించుకుంది. తర్వాత అక్కినేని ట్యాగ్ కూడా వదిలేసుకుంది. కట్ చేస్తే విడాకులు అయింది. ఆ తర్వాత చాలామంది అదే రూట్ స్టార్ట్ చేశారు. డివోర్స్ అనగానే ముందు ఫోటోస్ నే వదులుకుంటున్నారు. అదే రూట్ లో హన్సిక మోత్వాని కూడా స్టార్ట్ చేసింది.

నిజానికి హన్సిక మొదట శింబుతో ప్రేమాయణం సాగించింది. పెళ్లి కూడా చేసుకోబోతోంది అనిపించింది. తర్వాతేమైందో.. ఆ ఇద్దరూ విడిపోయారు. ఆపై ఆమె సొహైల్ ఖతూరియాను 2022 డిసెంబర్ డిసెంబర్ 4న పెళ్లి చేసుకుంది. పైగా తమది లాంగ్ టైమ్ రిలేషన్ అనే కలరింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ లాంగ్ రిలేషన్ కు ఎండ్ కార్డ్ వేస్తోంది. సొహైల్ ను విడాకులు తీసుకోబోతోంది అనిపించేలా తమ పెళ్లి ఫోటోస్ అన్నీ తొలగించుకుంది. వాస్తవం ఏంటంటే ఈ ఇద్దరూ విడిపోతున్నారు అనే రూమర్స్ చాలా రోజులుగా వస్తున్నాయి. కానీ ఆ మాటను హన్సిక కొట్టి పడేసింది. బట్ ఫైనల్ గా విడాకులుకు రెడీ అవుతున్నారు అనిపించేలా తమ పెళ్లి ఫోటోస్ అన్నీ డిలీట్ చేస్తోంది. సో.. త్వరలోనే డివోర్స్ అనే మాటలు కూడా వినబడతాయి.

Tags

Next Story