Hansika Motwani-Sohael Khaturiya: ఘనంగా ముగిసిన హన్సిక వివాహ వేడుకలు..

Hansika Motwani-Sohael Khaturiya: జైపూర్‌లోని ముండోటా ఫోర్ట్ ప్యాలెస్‌లో హన్సిక మోత్వాని వివాహం ఆమె బాయ్‌ఫ్రెండ్-వ్యాపారవేత్త సోహెల్ కతురియా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జంట పెళ్లికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ ఆత్మీయ వేడుకలో పాల్గొన్నారు. హన్సిక పెళ్లికూతురుగా ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయింది. హన్సిక అందమైన సాంప్రదాయ ఎరుపు రంగు లెహంగా, ఆకర్షిణీయమైన ఆభరణాలు ధరించింది. మరోవైపు సోహెల్ పూర్తిగా ఐవరీ షేర్వానీ లుక్‌లో అందంగా కనిపించాడు.
కాగా.. హన్సిక మోత్వాని షక లక బూమ్ బూమ్, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ మరియు సోన్ పరి వంటి టీవీ సీరియల్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. హృతిక్ రోషన్ హిట్ చిత్రం కోయి మిల్ గయాలో కూడా హన్సిక నటించింది. బాలీవుడ్‌లో, ఆమె ఆప్ కా సురూర్, మనీ హై తో హనీ హై వంటి చిత్రాలను చేసింది. ఆమె 50వ సినిమా ప్రాజెక్ట్ మహా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. తదుపరి, ఆమె తమిళ చిత్రం రౌడీ బేబీలో కనిపించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com