Hanu Raghavapudi : ఆ సీన్ విషయంలో పెద్ద గొడవ జరిగింది : హను రాఘవపూడి

Hanu Raghavapudi : ఆ సీన్ విషయంలో పెద్ద గొడవ జరిగింది : హను రాఘవపూడి
Hanu Raghavapudi : సీతారామం ఘన విజయంతో పాటు కొన్ని ట్రోల్స్ కూడా పుడుతున్నాయి

Hanu Raghavapudi : సీతారామం ఘన విజయంతో పాటు కొన్ని ట్రోల్స్ కూడా పుడుతున్నాయి. అలాంటి వాటికి సమాధానిమిచ్చారు దర్శకుడు హనురాఘవపూడి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కలిసి సీతారామంలో నిజమైన ప్రేమికుల్లా నటించారు. రామ్, సీతామహాలక్ష్మి పాత్రలో ఇద్దరూ ఒదిగిపోయారు. ఇందులో ఓ సీన్ వెంకటేశ్ 'మళ్లీశ్వరి' మూవీలోంచి కాపీ కొట్టారని ట్రోల్స్ బయటికి వచ్చాయి. అయితే అది సహజంగా, సొంతంగా వచ్చిన ఐడియా అని, అది బేస్ ఐడియా అని దర్శకుడు చెప్పుకొచ్చారు. ఏ అబ్బాయి అయినా అమ్మాయిని ఒప్పించే క్రమంలో జరిగే సందర్భాన్ని ఇక్కడ చూపించామని చెప్పారు హను రాఘవపూడి. ఏదిఏమయినా మళ్లీశ్వరి సినిమాతో సీతారామంను పోల్చడం బాగుంది అని అన్నారు.

క్లైమాక్స్ లో రామ్ పాత్రను చంపివేయకుండా ఉండాల్సింది అని చాలా మంది అనుకున్నారు. ఈ విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్లతో పెద్ద గొడవకూడా జరిగిందన్నారు రాఘవపూడి. కానీ కథకు ఆ పాత్ర చివర్లో క్లోస్ అవుతేనే న్యాయం చేసినట్లు అవుతందన్నారు హను రాఘవపూడి.

Tags

Read MoreRead Less
Next Story