Hanu Raghavapudi: అవకాశం వస్తే ఆ సినిమా మళ్లీ..: టాలీవుడ్ డైరెక్టర్

Hanu Raghavapudi: అవకాశం వస్తే ఆ సినిమా మళ్లీ..: టాలీవుడ్ డైరెక్టర్
Hanu Raghavapudi: టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి ప్రేమ కధలను అందంగా తెరకెక్కిస్తారని మొదటి సినిమా అందాల రాక్షసితోనే అర్థమైపోయింది.

Hanu Raghavapudi:టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి ప్రేమ కధలను అందంగా తెరకెక్కిస్తారని మొదటి సినిమా అందాల రాక్షసితోనే అర్థమైపోయింది. ప్రస్తుతం ఆయన దుల్కర్ సల్మాన్‌తో సీతారామం చిత్రాన్ని తెరకెక్కించారు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. అందులో భాగంగానే హను పలు విషయాలు పంచుకున్నారు.

నితిన్‌తో తాను తీసిన లై చిత్రం ఫ్లాప్ అవడానికి గల కారణాలను వివరించారు. ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డానని.. రిజల్ట్ ఆ విధంగా ఉండడం చాలా బాధించిందని చెప్పారు. ఈ సినిమా ఫెయిల్యూర్‌కు ముఖ్య కారణం విడుదల తేదీ. అదే రోజు రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి, జయ జయ జానకి సినిమాలు పోటీగా విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద విపరీతమైన బజ్ ఉంది. పైగా ఆ రెండు చిత్రాలు యాక్షన్ జోనర్‌లో తెరకెక్కాయి.

లై సినిమా థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కింది. ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కలేదు. దాంతో ఫ్లాప్‌గా మిగిలింది. ప్రస్తుతం తాను తీసిన సీతారామం కథ.. 1965 బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుంది. సీత కోసం రాముడు పడే సంఘర్షణలోంచి ఈ కథ పుట్టిందని చెప్పుకొచ్చారు. దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించగా, మృణాళ్ థాకూర్ ఆయన పక్కన హీరోయిన్‌గా నటించింది. రష్మిక మంథన కాశ్మీర్ అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించింది. కాగా ఈ చిత్రాన్ని స్వప్న దత్ నిర్మించినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story