హను-మాన్ ట్రైలర్.. ప్రశాంత్ వర్మ టేకింగ్ కి ఫిదా..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ టైటిల్ రోల్‌లో నటించిన హను-మాన్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా మారింది. ఉత్సాహాన్ని మరింత పెంచడానికి, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌తో ముందుకు వచ్చారు.
కథానాయకుడు నీటిలోకి దిగడం మరియు అక్కడ అసాధారణమైన వాటిని చూసే అద్భుతమైన సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అతను ఒక సూపర్ హీరోగా మారతాడు. అతడికి సూపర్ పవర్స్ కూడా వస్తాయి. అప్పుడు ప్రపంచాన్ని పరిపాలించడానికి సిద్ధంగా ఉన్న విలన్ వస్తాడు. తన లక్ష్యాన్ని సాధించడానికి నిజమైన శక్తుల అన్వేషణలో అతడు ఉంటాడు. అతను తన సైన్యంతో అంజనాద్రిలో ప్రవేశించి అక్కడ ఉన్నవన్నీ నాశనం చేస్తాడు. మంచి vs చెడు పోరాటం కథనాన్ని మరింత ఆకర్షణీయంగా మలుస్తుంది.
ప్రశాంత్ వర్మ తన రచన, టేకింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అంజనాద్రిని అద్భుతంగా ప్రదర్శించారు. అండర్ డాగ్ పాత్రలో తేజ సజ్జ మెరిశాడు. వినయ్ రాయ్ విలనిజాన్ని అద్భుతంగా పండించాడు.
దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అత్యున్నతంగా ఉంది, హరి గౌర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుటోంది. కె నిరంజన్ రెడ్డి నిర్మించిన హను-మాన్ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com