Happy B'day Sonu Sood : రీల్ లైఫ్ లో విలన్.. రియల్ లైఫ్ లో హీరో

Happy Bday Sonu Sood : రీల్ లైఫ్ లో విలన్.. రియల్ లైఫ్ లో హీరో
సాయమంటే ముందుండే సోనూసూద్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

లక్షలాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి.. తన ఉదారమైన హావభావాలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న నటుడు సోనూసూద్. మానవతావాదిగా, సమాజం పట్ల తనకున్న అంకిత భావాన్ని ప్రదర్శిస్తూ కష్టమంటే అండగా నిలిచే హీరో సోనూసూద్. సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేసినా.. రియల్ లైఫ్ లో మాత్రం హీరోగానే పేరు తెచ్చుకున్నాడు. అలాంటి గొప్ప మానవతావాది పుట్టిన రోజు సందర్భంగా (జూలై ౩౦) ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన చేసిన మంచి పనులను తలచుకుంటూ హ్యాపీ బర్త్ డే సోనూసూద్.

కొవిడ్ తర్వాత ఒక స్టార్ గా పరిచయం ఉండొచ్చు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన గురించి తెలిసిన వారంతా దైవం మనుష్య రూపేణా అంటున్నారు. కారణం ఆయన చేసిన మంచి పనులే. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి చేదు గుర్తులు ఇంకా మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి. పేదా, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆ వ్యాధి గడగడలాడించింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియని వారికి బాసటగా నిలిచాడు సోనూసూద్. ముఖ్యంగా పేదవారికోసం షెల్టర్ లు ఏర్పటు చేయడం, వారికి నత్యావసర సరుకులు అందించడం చేశారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేరవేసేందుకు తన సొంత ఖర్చులతో రవాణా సౌకర్యాన్ని కల్పించారు. కొంత మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి చేరదీశారు. ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవలు ఎన్నో.. ఎన్నెన్నో..

అంతే కాదు ప్రాంతం, భాష, కులం, మతం బేధం లేకుండా ఆర్థికంగా ఆదుకున్నాడు సోనూసూద్. బిహార్ లోని కతిహార్ ప్రాంతానికి చెందిన ఓ ఇంజనీర్ తన ఉద్యోగాన్ని విడిచి సోనూ సూద్ పేరిట ఓ పాఠశాలను నిర్మించి 110మంది అనాథ పల్లలకు విద్యనందిస్తున్నారన్న విషయం తెలుసుకొని అతన్ని కలిసి ప్రశంసించాడు. అంతే కాదు ఎక్కువ మంది పిల్లలకు లబ్ధి కలిగేలా మరో బిల్డింగ్ ను ఏర్పాటు చేయాలని సోనూసూద్ సంకల్పించారు. అనాథ పిల్లలకు అత్యుత్తమ విద్యనందించడానికి ఏకంగా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.

ఇలా ఎంతో మంది నేనున్నానంటూ ఆసరాగా నిలిచి దేవుడికి మరో రూపం మనిషేనని నిరూపిస్తున్నాడు సోనూసూద్. పంజాబ్ లోని మోగా పట్టణంలో జన్మించిన ఆయన.. 1996 లో మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన మహిళ సోనాలిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story